కువైట్ స్కూల్ క్యాంటీన్లలో.. ఈ 7 రకాల ఆహార పదార్థాలపై నిషేధం

- August 20, 2024 , by Maagulf
కువైట్ స్కూల్ క్యాంటీన్లలో.. ఈ 7 రకాల ఆహార పదార్థాలపై నిషేధం

కువైట్: స్కూట్ క్యాంటీన్ల‌లో జ్యూస్‌లు, పైస్, పాలు, శాండ్‌విచ్‌లు, వివిధ రకాల బిస్కెట్లు, క్రాకర్లు, సలాడ్‌లు మరియు పండ్ల వినియోగం కోసం అనేక రకాల ఆహార ఉత్పత్తులను విద్యా మంత్రిత్వ శాఖ ఆమోదించింది. అదే సమయంలో  ఏడు ఆహార పదార్థాలను విక్రయించడాన్ని నిషేధించింది. ఈ నిషేధిత వస్తువులలో శీతల పానీయాలు, క్యాన్డ్ జ్యూస్‌లు, స్పోర్ట్స్, ఎనర్జీ డ్రింక్స్, అలాగే కొన్ని ప్రాసెస్ చేసిన ఆహారాలు ఉన్నాయి.

ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కోసం జనరల్ అథారిటీ స్కూట్ క్యాంటీన్ల‌లో  అన్ని రకాల శీతల పానీయాలు, అన్ని క్యాన్డ్ ఫ్రూట్ జ్యూస్‌లు, స్పోర్ట్స్ డ్రింక్స్ మరియు ఫుడ్స్, ఎనర్జీ డ్రింక్స్ మరియు ఫుడ్స్, చూయింగ్ గమ్, లాలీపాప్‌లు, మిఠాయిలు మరియు స్వీట్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ మరియు ప్రాసెస్ చేసిన మాంసాలు, సాసేజ్‌లు, ఊరగాయలు, మయోన్నైస్ మరియు ఫ్యాటీ సాస్‌లు వంటివాటి విక్ర‌యాల‌పై నిషేధం విధించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com