ఓఎన్జిసి కి మేఘా అత్యాధునిక ఆయిల్ డ్రిల్లింగ్ రిగ్ సరఫరా
- August 20, 2024
హైదరాబాద్: మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎం.ఈ.ఐ.ఎల్) రెండువేల అశ్వశక్తి సామర్థ్యంతో అత్యాధునిక ఆటోమేటెడ్ హైడ్రాలిక్ ఆయిల్ డ్రిల్లింగ్ రిగ్ (సి 3బి ఆర్ 1 ఎన్ జి 2000-5) ను రాజమండ్రిలోని ఓఎన్జిసి చమురు క్షేత్రంలో విజయవంతంగా ఏర్పాటు చేసింది. ఇది రాజమండ్రి అసెట్‌లో ఓఎన్జిసి కోసం ఎం.ఈ.ఐ.ఎల్ ఏర్పాటు చేసిన మూడవ రిగ్.
ఈ అత్యాధునిక రిగ్ 6000 మీటర్ల లోతువరకు తవ్వగగుతుంది.అధిక పీడనాలు,ఉష్ణోగ్రతలు ఉన్న సందర్భాలలో కూడా సమర్థవంతంగా, ప్రమాద రహితంగా పనిచేస్తుంది.ఐదు వేల పిఎస్‌ఐ వరకు పీడనాన్ని తట్టుకునే ఈ రిగ్ బ్లో ఔట్ ప్రివెంటర్ తో కూడి ఉండడం దీని ప్రత్యేకత. ఇది సంప్రదాయ రిగ్‌లతో పోలిస్తే ఎక్కువ భద్రత, తక్కువ నిర్వహణ ఖర్చుతో కూడినది.
ఈ రిగ్ పూర్తిగా ఆటోమేటెడ్‌గా, అధునాతన సాంకేతికతతో మానవ జోక్యం లేకుండా అత్యంత భద్రతతో పనిచేసే విధంగా రూపొందించబడింది.రాబోయే రోజుల్లో ఎం.ఈ.ఐ.ఎల్ డ్రిల్లింగ్ టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులను తీసుకురావడంలో కీలక పాత్ర పోషించనుంది.
ఈ రిగ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎం.ఈ.ఐ.ఎల్, డ్రిల్‌మెక్ మరియు ఓఎన్జిసి ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఓఎన్జిసి డైరెక్టర్ ఓం ప్రకాశ్ సింగ్, మను వర్మ (వైస్ ప్రెసిడెంట్ - కాంట్రాక్ట్స్,ఎం.ఈ.ఐ.ఎల్ ), మార్కో టోజ్జి (డిప్యూటీ సి.ఈ.ఓ, డ్రిల్‌మెక్), మిచెల్ బ్రుజ్జి (సి.ఓ.ఓ , డ్రిల్‌మెక్), సబిర్ హుస్సైన్ (వైస్ ప్రెసిడెంట్-ఇన్స్టాలేషన్ & కమిషనింగ్, డ్రిల్‌మెక్) , పాల్గొన్నారు.
‘మేక్ ఇన్ ఇండియా’ మరియు ‘ఆత్మనిర్భర్ భారత్’ కార్యక్రమాల కింద ఈ రిగ్‌లు స్వదేశీ సాంకేతికతతో రూపొందించబడ్డాయి. ఎం ఈ ఐ ఎల్ భారతదేశంలో స్వదేశీ సాంకేతికతతో ఆయిల్ డ్రిల్లింగ్ రిగ్‌లను తయారు చేసే , ఉపయోగించే మొదటి ప్రైవేట్ కంపెనీగా పేరు తెచ్చుకుంది.
అమెరికన్ పెట్రోలియం ఇనిస్టిట్యూట్ (API) ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేసిన ఈ రిగ్ ఆటోమేషన్ ద్వారా మానవ జోక్యాన్ని గణనీయంగా తగ్గించింది. ఇతర రిగ్‌లతో పోలిస్తే, కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే మొత్తం రిగ్‌ను నిర్వహించగలరు. Gen-X టెక్నాలజీతో తయారు చేసిన ఈ రిగ్ భద్రతను మెరుగుపరచడం ద్వారా అధిక ఉత్పాదకతను సాధిస్తుంది.ఎం.ఈ.ఐ.ఎల్ ఈ అత్యాధునిక రిగ్ సరఫరా తో, ఆయిల్ డ్రిల్లింగ్ టెక్నాలజీలో మరో మైలురాయి సృష్టించింది.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు