దుబాయ్ లో ఈ రూట్లలో 20% తగ్గిన ట్రావెల్ టైమ్..!

- August 21, 2024 , by Maagulf
దుబాయ్ లో ఈ రూట్లలో 20% తగ్గిన ట్రావెల్ టైమ్..!

దుబాయ్: ఆగస్టు 26న పాఠశాలలు పునఃప్రారంభం కావడానికి వారం ముందు దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) అల్ సఫా 1 స్కూల్స్ కాంప్లెక్స్‌లోని నాలుగు కీలక ప్రదేశాలలో ట్రాఫిక్ అప్డేట్ లను పూర్తి చేసినట్లు తెలిపింది. దీనితో ట్రాఫిక్ ఫ్లో మెరుగుపదురుందని,  ప్రయాణ సమయాన్ని 20 శాతం తగ్గిస్తుందని  ట్రాఫిక్ అండ్ రోడ్స్ ఏజెన్సీలో రోడ్స్ డైరెక్టర్ హమద్ అల్ షెహి తెలిపారు.

-షేక్ జాయెద్ రోడ్ జంక్షన్ నుండి అల్ హదికా రోడ్ (రెండవ జంక్షన్) నుండి స్ట్రీట్ 13కి వెళ్లే రౌండ్అబౌట్ వైపు ప్రయాణించే వాహనాల కోసం 255-మీటర్ల లేన్ సర్వీస్ రోడ్డుకు జోడించారు.  అల్ సఫాకు ప్రయాణ సమయం ఉంటుందని భావిస్తున్నారు. 

-అల్ సఫా స్కూల్ మరియు అల్ ఇత్తిహాద్ స్కూల్ సమీపంలో 22 సమాంతర పార్కింగ్ స్లాట్‌లను ఏర్పాటు చేశారు. ఇవి పీక్ అవర్స్‌లో రద్దీని తగ్గిస్తుందని తెలిపారు. 

- స్ట్రీట్ 19 నుండి అల్ వాస్ల్ స్ట్రీట్‌కు వెళ్లే మార్గాన్ని విస్తరించారు. ఇది 330-మీటర్ల పొడవైన లేన్‌ను కలిపారు. దీంతో అల్ వాస్ల్ స్ట్రీట్‌తో కూడలి వద్ద ట్రాఫిక్ ఫ్లో తగ్గుతుంది. జుమేరా కాలేజీకి ఎదురుగా 18 పార్కింగ్ స్లాట్‌లు ఏర్పాటు చేశారు.

-అల్ వాస్ల్ స్ట్రీట్‌లో అదనపు U-టర్న్ ఎగ్జిట్ ఏర్పాటు చేసారు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ట్రాఫిక్ ఫ్లో సులువు కానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com