600 దిర్హామ్ జరిమానా? అల్ కూజ్ లోని బస్ లేన్ తొలగింపు..!
- August 21, 2024
దుబాయ్: అల్ కూజ్ లోని ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ వెంబడి ఉన్న ప్రత్యేకమైన బస్ లేన్‌ను తొలగించినట్లు వాహనదారులు తెలిపారు. ఇప్పుడు ఆ మార్గంలోప్రైవేట్ వాహనాలు వెళుతున్నాయని చెప్పారు., వాహనదారులకు 600 దిర్హామ్‌ల పెనాల్టీ ఉంటుందని హెచ్చరించే బోర్డులు ఇంకా తొలగించలేదని తమ సోషల్ మీడియా అకౌంట్ లలో గుర్తు చేస్తున్నారు. దీనిపై రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) స్పందించింది. బస్ లేన్ ఒక దిశలో మాత్రమే ఉందని తెలిపింది. అల్ క్వోజ్ బస్ స్టేషన్ నుండి బౌలింగ్ సెంటర్ వరకు జబీల్ వైపు..అల్ మైదాన్ రోడ్, ఖలీద్ బిన్ అల్ వలీద్ రోడ్, నైఫ్ స్ట్రీట్ మరియు అల్ ఘుబైబా రోడ్‌లలో ప్రత్యేకమైన రెడ్, ఎల్లో లైన్స్ ఇప్పుడు ఉన్నాయని పేర్కొంది.“ఎల్లో లేన్ తాత్కాలికమైనది. ఈ బస్ లేన్‌ను ఉపయోగించుకోవడానికి తుది నిర్ణయం తీసుకోవడానికి అధ్యయనం కొనసాగుతోంది. మెట్రో స్టేషన్ల మధ్య మెట్రో మూసివేత సమయంలో (ఏప్రిల్ 16న భారీ వర్షాల నేపథ్యంలో) బస్సు లేన్‌లను ఏర్పాటు చేశాం.
ప్రత్యేక బస్సు మార్గాలను ఉపయోగించి పట్టుబడిన వాహనదారులపై 600 దిర్హామ్‌ల జరిమానా విధిస్తారు. ఎల్లో లైన్ అంటే పాసింగ్ కాద. వాహనదారుడు ఈ లైన్‌కు ఎడమ లేదా కుడి వైపునకు నడపకూడదు. డాట్టెడ్ ఎల్లో లైన్ అంటే ఒక డ్రైవర్ లేన్ మార్చడానికి లేదా మరొక వాహనాన్ని అధిగమించడానికి ఉపయోగించవచ్చు.” అని రోడ్‌సేఫ్టీయూఏఈ వ్యవస్థాపకుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్ థామస్ ఎడెల్‌మాన్ గత జూన్ లో వెల్లడించారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు