రాజావారు రాణివారు.! పెళ్లి సందడి షురూ చేశారు.!
- August 21, 2024
కిరణ్ అబ్బవరం - రహస్య గోరఖ్.. ‘రాజావారు రాణివారు’ సినిమాతో మొట్ట మొదటగా స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అప్పటి నుంచే లవ్‌లోనూ పడిపోయారు. అలా పెరిగి, పెద్దదైన వారి ప్రేమ పెళ్లి పీటల వరకూ చేరింది.
మార్చిలో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఈ జంట ఇప్పుడు పెళ్లి ముడితో ఒక్కటి కానున్నారు. గురువారం అనగా ఆగస్టు 22న ఈ జంట వివాహం చేసుకోబోతున్నారు.
కూర్గ్‌లో ఈ వివాహ వేడుకకు రంగం సిద్ధమైంది. ఆల్రెడీ పెళ్లి పనుల్లో బిజీగా వున్న ఈ జంట సెలబ్రేషన్స్‌ని సోషల్ మీడియాలో అభిమానుల కోసం షేర్ చేసుకుంటోంది. దానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయ్.
ఇక, కిరణ్ అబ్బవరం సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ‘క’ సినిమాలో నటిస్తున్నారు. పీరియాడిక్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. పెళ్లి నిమిత్తం కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్న కిరణ్ అబ్బవరం ఆ తర్వాత మళ్లీ షురూ చేయనున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ప్రచార చిత్రాలకి మంచి రెస్పాన్స్ వస్తోంది. వెరీ లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన ఆడియో సింగిల్‌కీ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు