పూరీకి తప్పని కష్టాలు.! ‘డబుల్’ ఇస్మార్ట్ నష్టాలు.!
- August 21, 2024
పూరీ జగన్నాధ్‌ని కష్టాలు వెంటాడుతూనే వున్నాయ్. సొంత నిర్మాణంలో తెరకెక్కుతోన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టేస్తున్నాయ్. ‘లైగర్’ దెబ్బ నుంచి ఇప్పటికే కోలుకోలేదు.
ఎలాగైనా ‘ఇస్మార్ట్ శంకర్’తో హిట్టు కొట్టి ‘లైగర్’ నష్టాల్ని పూడ్చుకోవాలని ఆశ పడిన పూరీకి మళ్లీ నిరాశే మిగిలింది. ఈ సినిమాకి ఫస్ట్ డే టాకే తేలిపోయింది. దాంతో, ఎవ్వరూ ఈ సినిమాని దేకలేదు.
కలిసొచ్చిన సెలవులు ఒకింత ఊరటనిచ్చినప్పటికీ 52 కోట్ల బ్రేక్ ఈవెన్ ఎక్స్‌పెక్ట్ చేసిన ‘డబుల్ ఇస్మార్ట్’, కేవలం 12 కోట్లకే పరిమితమవ్వడం దారుణమైన దెబ్బను మిగిల్చింది.
దాంతో, మళ్లీ పూరీ జగన్నాధ్ నష్టాల్ని చవి చూడాల్సి వచ్చింది. ‘లైగర్’ నష్టాలతోనే దారుణమైన అవమానాలకు గురయ్యాడు పూరీ జగన్నాధ్. నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు తోచినంత నష్టాల్ని భర్తీ చేసే కార్యక్రమం చేపట్టాడు.
అదే ఇంకా పూర్తి కాలేదంటే, ఇప్పుడు ‘డబుల్ ఇస్మార్ట్’ యవ్వారం ఎంత దూరం వెళుతుందో చూడాలి మరి.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు