డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మారిన సూపర్ స్టార్ మహేష్.!
- August 21, 2024
అవునండీ నిజమే.. సూపర్ స్టార్ మహేష్ బాబు డబ్బింగ్ ఆర్టిస్టుగా మారబోతున్నారు. ఓ హాలీవుడ్ యానిమేషన్ మూవీలో ఆయన గొంతు వినపడనుంది. అది మరేదో కాదు. పిచ్చ క్రేజ్ వున్న ’ది లయన్ కింగ్‘.
హాలీవుడ్ యానిమేషన్ మూవీ ’ది లయన్ కింగ్‘కి పరిచయం అక్కర్లేదు. ఎంతో పాపులర్ ఈ సినిమా. పిల్లలకే కాదు, పెద్దలూ ఈ సినిమాకి మంచి ఆదరణ చూపించారు.
అంతలా ఈ సినిమాలోని ఎమోషన్స్ కట్టి పడేశాయ్ మరి. ఇప్పుడీ సినిమాకి సీక్వెల్ రాబోతోంది. ’ ది లయన్ కింగ్ 2‘ పేరుతో వస్తోన్న ఈ సినిమాకి తెలుగు వెర్షన్ డబ్బింగ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
తొలి పార్టులో బేబీ లయన్ ముఫాషాని రాజుగా ప్రకటించడంతో సినిమాకి ఎండ్ కార్డ్ పడుతుంది. రెండో పార్ట్ అక్కడి నుంచే మొదలు కానుంది. అలా మెయిన్ లీడ్ పాత్ర అయిన ముఫాసా పాత్రకి సూపర్ స్టార్ మహేష్ తన గొంతును అరువివ్వబోతున్నారు.
మహేష్ బాబు డైలాగులతో తెలుగు వెర్షన్ ముఫాసా పాత్ర తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర కానుంది. అలాగే బాలీవుడ్లో ఇదే పాత్రకి బాద్ షా షారూఖ్ ఖాన్ డబ్బింగ్ చెప్పబో్తున్నారు.
చూడాలి మరి, అసలే బోలెడంత ట్రెండింగ్ మూవీ. అటు పై స్టార్ హీరోల వాయిస్.. ఈ సారి రాబోయే ’ది లయన్ కింగ్ 2‘ ఏ రేంజ్ క్రేజ్ దక్కించుకోనుందో చూడాలి మరి.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు