ఆకాష్ జగన్నాధ్ పేరు మారింది సరే, లక్కు సంగతేందీ.!
- August 21, 2024
ఆకాష్ జగన్నాధ్.. ఈ కొత్త హీరో ఎవరనుకుంటున్నారా.? పాత హీరోనే. కానీ, పేరు కొత్తది. పూరీ జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరీ.. ఇప్పుడు ఆకాష్ జగన్నాధ్ అని పేరు మార్చుకున్నాడు.
పేరు మారితే లక్క మారుతుందేమోనన్న వుద్దేశ్యంతోనే ఆకాష్ పేరు మార్చుకున్నాడు. ’మెహబూబా‘ సినిమాతో హీరోగా పరిచమైన ఆకాష్ తదుపరి రెండు మూడు సినిమాలు చేశాడు.
కానీ, ఆశించిన హిట్ దక్కించుకోలేకపోయాడు. ఇక, ఇప్పుడు కాశీ పరశురామ్ అనే కొత్త దర్శకుడి కథతో రాబోతున్నాడు. ఇదో మాస్ యాక్షన్ మూవీ అని తెలుస్తోంది.
ఈ సినిమాకి సంబంధించి తండ్రి పూరీ జగన్నాధ్ జోక్యం ఏమీ లేదు. నిర్మాణ పరంగా కానీ, డైరెక్షన్ పరంగా కానీ, పూరీ జగన్నాధ్ కల్పించుకోవడం లేదు.
ఆకాష్ మంచి విషయమున్నోడే. కానీ, ఎందుకో టైమ్ కలిసి రావడం లేదంతే. ఒక్కసారి కలిసొచ్చిందా.? ఇక అంతే వెనక్కి తిరిగి చూసుకోనక్కర్లేదు.
ఏమో ఈ కొత్త హ్యాండ్ అయినా ఆకాష్కి కలిసి రావాలని ఆశిద్దాం. లేటెస్ట్ గా ఈ సినిమా లాంచింగ్ జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. ఈ సినిమా కోసం ఆకాష్ గెటప్ కూడా ఛేంజ్ చేశాడు. కంప్లీట్ యాక్షన్ హీరోలా కండలు తిరిగిన దేహంతో కనిపిస్తున్నాడు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు