ఒమన్ లో ఘనంగా రాజస్థానీ తీజ్ ఉత్సవ్

- August 22, 2024 , by Maagulf
ఒమన్ లో ఘనంగా రాజస్థానీ తీజ్ ఉత్సవ్

మస్కట్: ఇండియన్ సోషల్ క్లబ్ (ISC), ఒమన్ రాజస్థానీ వింగ్ ఆధ్వర్యంలో ఆగస్టు 16, 2024న హఫా హౌస్ హోటల్‌లో సాంప్రదాయ రాజస్థానీ పండుగ శ్రావణ్ ఉత్సవ్ -తీజ్ వేడుకను నిర్వహించింది. రాజస్థానీ కమ్యూనిటీకి చెందిన దాదాపు 80 మంది మహిళలు ఉత్సవాల్లో పాల్గొన్నారు. రాజస్థాన్  సంప్రదాయాలు మరియు సాంస్కృతిక సంపదను ప్రదర్శించే సాంస్కృతిక కార్యక్రమాలను వేడుకలలో భాగంగా నిర్వహించారు.  
తీజ్ పండుగ అనేది మహిళలకు సంబంధించిన ఒక సాంస్కృతిక పండుగ. దీనిని రాజస్థాన్‌లో ఘనంగా జరుపుకుంటారు. తమ భర్త మరియు కుటుంబ సభ్యుల ఆరోగ్యం,  సంక్షేమం కోసం రోజంతా ప్రార్థనలు చేస్తారు.ఉపవాసం ఉంటారు. తీజ్ పండుగ ప్రేమ కలయికను మాత్రమే కాకుండా, ప్రకృతిని ఆరాధించే క్రతువుగా భావిస్తారు. ఈ కార్యక్రమాల నిర్వహణకు సహకారం అందించిన వాలంటీర్లను రాజస్థానీ వింగ్ కోఆర్డినేటర్, సుధా పంకజ్ జోషి అభినందించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com