ఖలాలీలో బాలికల కొత్త పాఠశాల.. 1,320 మంది విద్యార్థులకు ప్రయోజనం..!

- August 22, 2024 , by Maagulf
ఖలాలీలో బాలికల కొత్త పాఠశాల.. 1,320 మంది విద్యార్థులకు ప్రయోజనం..!

కువైట్: కువైట్ ఫండ్ ఫర్ అరబ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ (KFAED) ద్వారా ఖలాలీలో బాలికల కోసం ప్రాథమిక మరియు మాధ్యమిక పాఠశాల నిర్మాణం చేపట్టనున్నది. దీనిని విద్యా మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుంది. పెరుగుతున్న విద్యార్థుల జనాభాకు మెరుగైన విద్యా వాతావరణాన్ని అందించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం అని MP ఖలీద్ బునాక్ తెలిపారు. దీని కోసం ఖలాలీలో ప్రభుత్వం 12,007 చదరపు మీటర్ల ప్లాట్‌ను కేటాయించింది. పాఠశాలలో రెండు విద్యా భవనాలు ఉంటాయి. ఒక్కొక్కటి నాలుగు అంతస్తులు. ఒక్కో భవనంలో 22 తరగతి గదులు ఉంటాయి. ఈ పాఠశాలలో దాదాపు 1,320 మంది విద్యార్థులు ఉంటారు. ఒక్కో తరగతికి 30 మంది విద్యార్థులు ఉంటారు. సైన్స్ ల్యాబ్‌లు, ఫ్యామిలీ ఎడ్యుకేషన్ ల్యాబ్‌లు, కంప్యూటర్ ల్యాబ్‌లు, డిజైన్ మరియు టెక్నాలజీ ల్యాబ్‌లు, ఆర్ట్ రూమ్ మరియు టీచర్ల రూమ్‌లు ఉంటాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com