షేక్ హసీనా దౌత్య పాస్‌పోర్ట్‌ను రద్దు చేసిన బంగ్లా ప్రభుత్వం
- August 22, 2024
బంగ్లాదేశ్: ఢాకా: మాజీ ప్రధాని షేక్ హసీనాకు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం మరో ఝలక్ ఇచ్చింది. ఆమె దౌత్య పాస్‌పోర్ట్‌ను బంగ్లా ప్రభుత్వం రద్దు చేసింది. హసీనాతో పాటు ఆమె పార్టీకి చెందిన మాజీ ఎంపీల దౌత్య పాస్‌పోర్ట్‌లను కూడా క్యాన్సిల్ చేసినట్లు బంగ్లా హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, దౌత్య పాస్‌పోర్టు ఉన్నవారు కొన్ని నిర్దిష్ట దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే వెసులుబాటును కలిగి ఉంటారు.
ఇక బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల కోటాకు వ్యతిరేకంగా చెలరేగిన నిరసనల కారణంగా హసీనా తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె ఏకంగా దేశాన్ని కూడా వదిలిపెట్టాల్సి వచ్చింది. అలా ఈ నెల 5న బంగ్లాదేశ్‌ను వీడిన షేక్ హసీనా ప్రస్తుతం ఇండియాలో ఆశ్రయం పొందుతున్నారు.
ఈ క్రమంలో షేక్ హసీనాను తమ దేశానికి అప్పగించాలని ఇప్పటికే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) భారత ప్రభుత్వాన్ని కోరింది. బంగ్లాదేశ్ విజయాన్ని అడ్డుకునేందుకు భారత్ నుంచి ఆమె కుట్ర చేస్తున్నారని ఈ సందర్భంగా బీఎన్పీ ఆరోపించింది. కాగా, నిరసనల్లో చెలరేగిన హింస కారణంగా చనిపోయిన వారి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో హసీనాపై పదుల సంఖ్యలో హత్య కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆమె మొత్తంగా 44 కేసులను ఎదుర్కొంటున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు