హైదరాబాద్‌లో హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టు..
- August 22, 2024
హైదరాబాద్: హైదరాబాద్‌లో హైటెక్ వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. విదేశీ యువతులతో ఆన్‌లైన్ వెబ్‌సైట్ ద్వారా ఆర్గనైజ్డ్‌గా వ్యభిచారం చేయిస్తున్న గ్యాంగ్ ఆటకట్టించారు. కొండాపూర్ ఒక ఇండిపెండెంట్ హౌస్‌లో గుట్టుగా గలీజు దందా సాగుతుందన్న సమాచారంతో గచ్చిబౌలి, యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ పోలీసులు దాడులు చేశారు. 17 మంది విదేశీ యువతులను అదుపులోకి తీసుకుని సేఫ్ హౌస్‌కు తరలించారు. వీరిలో కెన్యా దేశానికి చెందిన 14 మందితో పాటు ఉగాండా, టాంజానియా దేశాలకు చెందిన యువతులు ఉన్నట్టు గుర్తించారు.
వ్యభిచార ముఠా నిర్వాహకుడు శివ కుమార్‌తో పాటు ఇద్దరు విటులను పోలీసులు అరెస్టు చేశారు. లోకాంటో అనే వెబ్‌సైట్‌లో యువతుల ఫోటోలు పెట్టి విటులను రప్పిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. స్పాట్ నుంచి 4 మొబైల్ ఫోన్లు, 25 హెచ్ఐవీ కిట్లు, హుక్కా పాట్స్, 20 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. వ్యభిచార దందాలపై నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని, ఇటువంటి గురించి తెలిస్తే తమకు సమాచారం అందించాలని సూచించారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు