నేపాల్‌లో పడిన బస్సు…14 మంది భారతీయులు మృతి
- August 23, 2024
కాట్మండు: నేపాల్‌లో భారతీయ పర్యటకులతో ప్రయాణిస్తున్న బస్సు నదిలోకి దూసుకెళ్లింది.ఈ ఘటనలో 14 మంది మృతిచెందగా.. పలువురు గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. మరికొందరు నదిలో గల్లంతయ్యారు. తనాహున్ జిల్లాలో కొండల ప్రాంతంలో అదుపు తప్పి మర్స్యాంగ్డి నదిలో బస్సు పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరంతా భారతీయులే. ఉత్తరప్రదేశ్ నెంబర్ ప్లేట్ తో ఉన్న ఓ ట్రావెల్స్ బస్సు శుక్రవారం ఉదయం నేపాల్ లోని పొఖారా నుంచి కాఠ్ మాండూ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ప్రమాదం జరిగిన వెంటనే ఆర్మీ, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అయితే, 14మంది మృతదేహాలను వెలికితీయగా.. 16మంది ప్రయాణికులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. బస్సు ప్రమాదం సమయంలో 40 మంది ఉండగా.. మరో పది మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ రిలీఫ్ కమిషనర్ స్పందించారు. స్థానిక అధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు