అమెరికాలో TANA బ్యాక్ ప్యాక్ కార్యక్రమం విజయవంతం...
- August 23, 2024
అమెరికా: ఉత్తర అమెరికా తెలుగు సంఘం ప్రతి ఏటా బ్యాక్‌ప్యాక్ పేరిట చిన్నారులకు స్కూల్ బ్యాగ్‌లను పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. తమను ఆదరించిన అమెరికాలోని కమ్యూనిటీకి తమవంతుగా సేవలందించాలన్న ఉద్దేశ్యంతో తానా ఈ బ్యాక్ ప్యాక్ కార్యక్రమాన్ని ఎన్నో సంవత్సరాలుగా నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం కూడా బ్యాక్‌ప్యాక్ కార్యక్రమాన్ని తానా నాయకులు చేపట్టారు. ఛార్లెట్‌లో ఆగస్టు 22వ తేదీన క్లియర్ క్రీక్ ఎలిమెంటరీ స్కూల్‌లోని పేద పిల్లలకు స్కూల్ బ్యాగ్ లను పంపిణీ చేశారు. బ్రన్స్ ఎవెన్యూ ఎలిమెంటరీ స్కూల్ లోని పిల్లలకు కూడా స్కూల్ బ్యాగ్ లను అందజేశారు. ఈ బ్యాక్ ప్యాక్ కార్యక్రమం కింద దాదాపు 300కు పైగా బ్యాగ్ లను పిల్లలకు అందజేశారు. ఇందులో క్రేయాన్స్, ఎరేజర్స్, పెన్సిల్, షార్పనర్స్, పెన్నులు తదితర వస్తువులను కూడా కలిపి అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఛార్లెట్ లోని తానా నాయకులు పలువురు పాల్గొన్నారు. తానా స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ నాగమల్లేశ్వర పంచుమర్తి, తానా ఇంటర్నేషనల్ కో ఆర్డినేటర్ ఠాగూర్ మల్లినేని, తానా టీమ్ స్క్వేర్ చైర్మన్ కిరణ్ కొత్తపల్లి, పట్టాభి కంఠమనేని, రమణ అన్నే, సతీష్ నాగభైరవ, పార్ధ సారధి గునిచెట్టి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్కూల్ నిర్వాహకులు, టీచర్లు మాట్లాడుతూ, తానా కమ్యూనిటీకి చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. తానా బ్యాక్ ప్యాక్ కింద తమ స్కూల్ ను ఎంపిక చేసుకుని పిల్లలకు స్కూల్ బ్యాగ్ లను పంపిణీ చేసినందుకు వారు స్థానిక తానా నాయకులకు ధన్యవాదాలు చెప్పారు. పిల్లల తల్లితండ్రులు కూడా తానాకు తమ అభినందనలు తెలియజేశారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?