'సాహసం శ్వాసగా సాగిపో'' సాంగ్ ట్రైలర్స్ విడుదల..
- June 17, 2016
నాగచైతన్య ,మంజిమ మోహన్ ప్రధాన పాత్రలలో గౌతమ్ మీనన్ తెరకెక్కించిన చిత్రం 'సాహసం శ్వాసగా సాగిపో'. ఎ.ఆర్.రెహమాన్ స్వరకర్త గా ఉన్న ఈ చిత్రాన్ని కోన వెంకట్ సమర్పిస్తుండగా, మిరియాల రవీందర్‌రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో ఈ చిత్ర పాటలు విడుదల కార్యక్రమం జరిగింది. తొలి సీడీని ప్రముఖ కథానాయకులు నాగార్జున, గోపీచంద్ ఆవిష్కరించారు. ఎ.ఆర్.రెహమాన్ స్వీకరించారు. వి.వి.వినాయక్ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. నాగచైతన్య మాట్లాడుతూ ఇప్పటికీ 'ఏ మాయ చేసావె' పాటలు వెంటాడుతున్నాయి. 'సాహసం శ్వాసగా సాగిపో'తో మరిన్ని అద్భుతమైన పాటలు ఇచ్చినందుకు ఎ.ఆర్.రెహమాన్‌గారికి కృతజ్ఞతలు.
ఆయనతో పనిచేసే అవకాశం రెండోసారి ఇప్పించారు గౌతమ్‌మేనన్. విజయాల్ని అందించిన దర్శకులతో మళ్లీ మళ్లీ పనిచేయాలని కోరుకొంటుంటా. అలాంటి అవకాశం గౌతమ్ మీనన్ తో వచ్చినందుకు ఆనందంగా ఉంది 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమా ఓ గొప్ప ప్రయాణం అని తెలిపాడు చైతూ. ఇక ఈ కార్యక్రమంలో డి.సురేష్‌బాబు, సాయిధరమ్ తేజ్, రెజీనా, వంశీ పైడిపల్లి, కల్యాణ్‌కృష్ణ, అనంత శ్రీరామ్, దశరథ్, మాజీ డీజీపీ దినేష్ రెడ్డి, రాకేందు మౌళి తదితరులు పాల్గొన్నారు. ఈ ఆడియో వేడుక సందర్బంగా కొన్ని సాంగ్ ట్రైలర్స్ విడుదల చేసారు. వాటిపై మీరు ఓ లుక్కేయండి.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







