మలయాళంలో అదృష్టం పరీక్షించుకోనున్న బేబమ్మ.!
- August 24, 2024
‘ఉప్పెన’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై అతి తక్కువ టైమ్‌లోనే స్టార్ హీరోయిన్ చైర్‌ని అధిరోహించే అవకాశాన్ని దక్కించుకున్న ముద్దుగుమ్మ కృతి శెట్టి.
అయితే, కాలం కలిసి రాలేదు. ఎంత స్పీడుగా అవకాశమొచ్చిందో.. అంతే స్పీడుగా ఆ అవకాశం కోల్పోయింది కృతి శెట్టి. వరుస ఫెయిల్యూర్స్ చవి చూసింది. దాంతో ఈజీగా స్కిప్ చేసేశారు బేబమ్మని. దాంతో తమిళ, మలయాళ భాషల్లో అవకాశాల కోసం దారులు సిద్ధం చేసుకుంది.
ఆ క్రమంలోనే తాజాగా ఓ మలయాళ సినిమాతో మల్లూవుడ్‌లో అడుగు పెడుతోంది. మలయాళ యంగ్‌స్టర్ టువినో థామస్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.
ఈ సినిమాలో తన పాత్ర ఛాలెంజింగ్‌గా వుంటుందనీ, పర్‌ఫామెన్స్‌కి చాలా స్కోపున్న పాత్రనీ చెబుతోంది. ఒక్క ఎక్స్‌ప్రెషన్‌లోనే ఎన్నో హావ భావాలు పలికించాల్సి వుంటుందనీ, అన్నింటికీ మించి మలయాళ భాష నేర్చుకోవడం తనకు పెద్ద సవాల్‌గా మారిందనీ.. అయినా ఆ ఎక్స్‌పీరియన్స్ చాలా చాలా బాగుందనీ చెబుతోందీ క్యూట్ బ్యూటీ కృతి శెట్టి. చూడాలి మరి, అక్కడైనా స్టార్ డమ్ దక్కించుకుంటుందేమో కృతి శెట్టి.
తాజా వార్తలు
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్‌లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!
- ఇండియా-ఒమన్ ఆర్థిక భాగస్వామ్యం..షురా కౌన్సిల్ సమీక్ష..!!
- హైదరాబాద్‌లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్‌లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్







