మహేష్ మూవీకి టైటిల్ అదేనా.?

- August 24, 2024 , by Maagulf
మహేష్ మూవీకి టైటిల్ అదేనా.?

‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత రాజమౌళి, ‘గుంటూరు కారం’ సినిమా తర్వాత మహేష్ బాబు నుంచి వస్తున్న సినిమా సంగతి తెలిసిందే.

భారీ బడ్జెట్‌తో ప్యాన్ ఇండియా సినిమాగా ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. విజయేంద్ర ప్రసాద్ కథ సిద్ధం చేసే పనిలో బిజీగా వున్నారు. అది కూడా ఓ కొలిక్కి వచ్చినట్లే అని తెలుస్తోంది.

సినిమా అయితే ఇప్పట్లో మొదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. బహుశా జనవరి నుంచి స్టార్ట్ అయ్యే అవకాశాలున్నట్లు ఇన్‌సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం.
కాగా, లేటెస్ట్‌గా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన ప్రచారం తెరపైకి వచ్చింది. అదేంటంటే సినిమాకి ‘గరుడ’ అనే టైటిల్ అనుకుంటున్నారని.

సాహస యాత్రల నేపథ్యంలో రూపొందబోయే చిత్రంగా రాజమౌళి ఎప్పుడో ఈ ప్రాజెక్ట్ గురించి హింట్ ఇచ్చేశాడు. అయితే, తాజా ప్రచారం ప్రకారం ‘గరుడ’ అనే టైటిల్ ఎలా తెరపైకి వచ్చిందో కానీ, సోషల్ మీడియాలో బంగారు గద్ద రెక్కలతో కూడిన లోగో ఒకటి హల్ చల్ చేస్తోంది.

జరుగుతున్న ప్రచారం ప్రకారం ఈ టైటిల్ బాగానే వుందంటూ పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. చూడాలి మరి, ఈ ప్రచారానికి సంబంధించి జక్కన్న ఎలా స్పందిస్తారో.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com