మరో ఆరు నెలల పాటు ISS లోనే సునీతా విలియమ్స్
- August 25, 2024
భారత సంతతి వ్యోమగామి సునితా విలియమ్స్, అమెరికా వ్యోమగామి బ్యారీ బుచ్ విల్మోర్‌లు మరో ఆరు నెలలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSలోనే ఉండనున్నారు. బోయింగ్ కంపెనీకి చెందిన స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్‌ను కేవలం 10 రోజుల అంతరిక్ష యాత్ర కోసం ఈ ఏడాది జూన్ 5న ప్రయోగించారు. అయితే అందులోని థ్రస్టర్ పనితీరు దెబ్బతింది. హీలియం లీకేజీ జరుగుతోంది. ఈ సమస్యల కారణంగా స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్‌ను తాత్కాలికంగా ISSకు అటాచ్ చేశారు. ISS నుంచి ఇప్పుడు సునితా విలియమ్స్, బ్యారీ బుచ్ విల్మోర్‌లకు అన్ని రకాల సౌకర్యాలు అందుతున్నాయి. వారు అక్కడికి చేరుకొని ఇప్పటికే 80 రోజులు దాటిపోయింది.
ఈ సమస్యల కారణంగా స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్‌ను తాత్కాలికంగా ISSకు అటాచ్ చేశారు. ISS నుంచి ఇప్పుడు సునితా విలియమ్స్, బ్యారీ బుచ్ విల్మోర్‌లకు అన్ని రకాల సౌకర్యాలు అందుతున్నాయి. వారు అక్కడికి చేరుకొని ఇప్పటికే 80 రోజులు దాటిపోయింది.
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా శనివారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఆ ఇద్దరు వ్యోమగాములు భూమికి తిరిగొచ్చేది వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే అని ప్రకటించింది. అంటే మరో 200 రోజుల పాటు సునితా విలియమ్స్, బ్యారీ బుచ్ విల్మోర్ అక్కడే ఉండాల్సి వస్తుంది. దీంతో వారిద్దరి ఆరోగ్య భద్రత, స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ పునరుద్ధరణపై పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ తరఫున క్రూ-9 మిషన్ ద్వారా పలువురు వ్యోమగాములు ఈ ఏడాది సెప్టెంబరు 24న అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. వారంతా 2025 సంవత్సరం ఫిబ్రవరి నెలలో భూమికి తిరిగి రానున్నారు. ఆ టైంలో వారితోపాటు కలిసి సునితా విలియమ్స్, బ్యారీ బుచ్ విల్మోర్ భూమికి తిరిగి వచ్చేస్తారని నాసా వెల్లడించింది. స్టార్ లైనర్ వ్యోమనౌకను సిబ్బంది లేకుండానే నేవిగేట్ చేస్తూ భూమికి తీసుకురానున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్‌లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









