కువైట్ లో 392 వెబ్‌సైట్‌లు, 662 వాట్సాప్ నంబర్లు బ్లాక్

- August 25, 2024 , by Maagulf
కువైట్ లో 392 వెబ్‌సైట్‌లు, 662 వాట్సాప్ నంబర్లు బ్లాక్

కువైట్: చట్టవిరుద్ధ కార్యకలాపాలను ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలను తీసుకుంటున్నట్టు అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది.  డిపార్ట్‌మెంట్ ఆఫ్ కంబాటింగ్ సైబర్‌క్రైమ్ దాదాపు 392 స్కామ్ వెబ్‌సైట్‌లను తొలగించిందని,  ఇందులో 52 వెబ్‌సైట్‌లు (అల్-దుర్రా) గృహ కార్మికుల రిక్రూట్ కంపెనీలుగా పేర్కొంటూ మోసాలకు పాల్పడుతుందని వెల్లడించారు. అలాగే 662 కంటే ఎక్కువ మోసపూరిత కువైట్ (WhatsApp) నంబర్‌లను బ్లాక్ చేసినట్టు, వాటిలో 65 శాతం కంపెనీలను ఫాలోఅవుతున్నాయని తెలిపారు.

(కువైట్ మొబైల్ ID) అప్లికేషన్ లేదా ఏదైనా ఇతర సైట్‌ల ద్వారా ఏదైనా కొనుగోళ్లు చేసే ముందు విశ్వసనీయ వెబ్‌సైట్‌లతో మాత్రమే వ్యవహరించాలని, వారి విశ్వసనీయతను ధృవీకరించాలని మంత్రిత్వ శాఖ ప్రతి ఒక్కరికి పిలుపునిచ్చింది. ఉచిత ఆన్‌లైన్ వెబ్ సృష్టికర్త Wix ద్వారా రూపొందించబడిన (Wix సైట్‌లు) వారి ఆర్థిక,  వ్యక్తిగత సమాచారం రక్షణను నిర్ధారించడానికి, మోసపూరిత కార్యకలాపాల బారిన పడకుండా ఉండటానికి సైట్ పేరును జాగ్రత్తగా చదవాలని సూచించింది.  సహాయం కోసం ప్రతి ఒక్కరూ సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌ను (వాట్సాప్) నంబర్ (97283939) లేదా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో డిపార్ట్‌మెంట్ ఖాతా (@ECCCD) ద్వారా సంప్రదించాలని పిలుపునిర్చారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com