భారత దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు..
- August 26, 2024
న్యూ ఢిల్లీ: భారత దేశ వ్యాప్తంగానేకాక, ప్రపంచ వ్యాప్తంగా హిందువులు పవిత్రంగా జరుపుకునే పండుగల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి ఒకటి. ఈ పర్వదినాన్నే కృష్ణాష్టమి, గోకులాష్టమి.. ఇంకా అష్టమి రోహిణి అనికూడా అంటారు. ప్రతీ సంవత్సరం శ్రావణ మాసం కృష్ణ పక్షంలోని అష్టమి తిథి, రోహిణి నక్షత్రంలో కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటారు. కృష్ణాష్టమి సందర్భంగా దేశ వ్యాప్తంగా శ్రీకృష్ణుని దేవాలయాలు ఉదయం నుంచి భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కృష్ణాష్టమి సందర్భంగా ఇస్కాన్ ఆలయాలను సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు. ఆ ఆలయాలకు భక్తులు పోటెత్తారు.
విష్ణువుకు అత్యంత ఇష్టమైన అవతారాల్లో శ్రీకృష్ణుడు అవతారం ఒకటని చెబుతారు. చిన్నతనంలో తల్లి యశోద బాల గోపాలుడిని అందంగా ముస్తాబు చేసేది. ఇందులో నెమలి కిరీటం, నడుము పట్టీ, ప్రకాశవంతమైన బొట్టు, చెవిపోగులు, పసుపు కండువా.. ఇలా మొదలైన వస్తువులతో శ్రీకృష్ణుడు ప్రకాశవంతంగా మెరిసేవారు. భక్తులు జన్మాష్టమి సందర్భంగా కృష్ణుడికి ఈ వస్తువులన్నీ సమర్పించాలి. దీని వల్ల ఇంట్లో సుఖసంతోషాలు, శ్రేయస్సులు లభిస్తాయని నమ్ముతారు. వైదిక క్యాలెండర్ ప్రకారం భాద్రపద మాసంలోని కృష్ణ పక్ష అష్టమి ఆగస్టు 25 ఆదివారం సాయంత్రం 6.09 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఆగస్టు 26వ తేదీ (సోమవారం) సాయంత్రం 4,49 గంటలకు ముగుస్తుంది. ఈ సంవత్సరం జన్మాష్టమి నాడు చంద్రుడు వృషశరాశిలో ఉండటం వల్ల జయంతి యోగం ఏర్పడుతుంది. ఈ శుభ సమయంలో పూజ చేయడం ద్వారా మంచి ఫలితాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం. జన్మాష్టమి ఆగస్టు 26వ తేదీ ఉదయం 12.01గంటల నుంచి 12.45గంటల వరకు ఉంటుంది. అంటే ఈ 45 నిమిషాల సమయంలో భక్తులు పూజ చేసుకోవడానికి అనువైన సమయం అని పండితులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు