వేములవాడలో మెగా జాబ్ మేళా
- August 26, 2024
తెలంగాణ: యువత నైపుణ్యం పెంచుకొని ఉపాధి అవకాశాలను సద్వినియోగిం చేసుకోవాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆకాంక్షించారు. రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలో మెగా జాబ్ మేళా ఆదివారం నిర్వహించగా, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే అక్కడ ఏర్పాటు చేసిన ఆయా సంస్థల స్టాల్ల్స్ ను సందర్శించారు. ఆయా సంస్థల్లో ఎందరికి ఉపాధి అవకాశాలు కల్పిస్తారు? ఉద్యోగం చేసేది ఎక్కడ? చేసే పని ఏమిటి? వేతనాలు ఎంత ఇస్తారు? వసతి సౌకర్యం కల్పిస్తారా తదితర అంశాలపై ఆరా తీశారు. అనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గురుకుల విద్యాలయాల్లో ఉద్యోగాలను భర్తీ చేసిందని, ఇటీవల టీచర్ల నియామకానికి మెగా డీఎస్సీ, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించి, కీ కూడా విడుదల చేసిందని తెలిపారు. అలాగే గ్రూప్-4 ఉద్యోగాలకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొనసాగుతుందని, గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను కూడా పూర్తి చేసి, మెయిన్స్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని వివరించారు. దాదాపు ఈ ఎనిమిది నెలల్లో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని వెల్లడించారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఇప్పటికే జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందని గుర్తు చేశారు.
--నారాయణ గుళ్ళపల్లి (మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు