అమెరికాలో స్విమ్మింగ్ ఫూల్ లో పడి తెలంగాణ వాసి మృతి..
- August 27, 2024
అమెరికా: అమెరికాలో మరో తెలుగు యువకుడు మరణించాడు. అమెరికాలో స్విమ్మింగ్ పూల్ లో పడి తెలంగాణ వ్యక్తి మరణించడం జరిగింది. ఈ విషాద సంఘటన.. ఆదివారం రాత్రి జరిగినట్లు సమాచారం. ఇక ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం పాతర్ల పాడుకు చెందిన ప్రవీణ్ అనే వ్యక్తి... అమెరికాలో టీచర్గా పని చేస్తున్నాడు. అయితే ప్రవీణ్ సరదాగా... తాజాగా స్విమ్మింగ్ పూల్ కు వెళ్లాడు.
అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ ప్రవీణ్ ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్ లో పడి చనిపోవడం... ఇప్పుడు కలకలం రేపుతోంది. అయితే దీనిపై పోలీసులు ఎలాంటి విచారణ జరపలేదని సమాచారం. అయితే తెలంగాణ వాసి అమెరికాల మృతి చెందిన నేపథ్యంలో... అతని పార్థివ దేహాన్ని సూర్యపేటకు తీసుకురావాలని... ప్రవీణ్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుతూ... తమ ఆవేదనను... వెళ్లగక్కుతున్నారు.
అయితే ప్రవీణ్ కుటుంబ సభ్యుల బాధను చూసి తరించుకుపోయిన జగదీశ్ రెడ్డి... వెంటనే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి ఫోన్ చేయడం జరిగింది. అమెరికాలో మృతి చెందిన సూర్యపేట జిల్లాకు చెందిన ప్రవీణ్ మృతదేహాన్ని వెంటనే... తెలంగాణకు తీసుకురావాలని ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి కోరారు. అయితే దీనిపై ఉత్తంకుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
--సాయి కిరణ్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు