దుబాయ్ లో 4 కొత్త మెట్రో లింక్ బస్ రూట్లు ప్రారంభం
- August 27, 2024
దుబాయ్: దుబాయ్ RTA నాలుగు కొత్త మెట్రో లింక్ బస్సు మార్గాలను ప్రారంభించినట్లు రోడ్లు మరియు రవాణా అథారిటీ తెలిపింది. నాలుగు కొత్త రూట్‌లు ఆగస్టు 30 నుండి పనిచేయడం ప్రారంభిస్తాయి. వాటిలో రూట్ 31ని రెండు కొత్త మార్గాల్లోకి (F39, F40)మార్చారు. ఇతర రెండు మార్గాలు రూట్ F56ని F58 మరియు F59తో భర్తీ చేయనున్నారు. ఇవన్నీ 30 నిమిషాల ఫ్రీక్వెన్సీతో పనిచేస్తాయి.
మొదటి కొత్త మార్గం F39..ఎటిసలాత్ బస్ స్టేషన్ నుండి ఔద్ అల్ ముతీనా రౌండ్అబౌట్ బస్ స్టాప్ 1 వరకు నడుస్తుంది.
రెండవ కొత్త మార్గం F40..ఎటిసలాట్ బస్ స్టేషన్ నుండి మిర్డిఫ్, స్ట్రీట్ 78 వరకు నడుస్తుంది.
రూట్ F58 అల్ ఖైల్ మెట్రో స్టేషన్ నుండి దుబాయ్ ఇంటర్నెట్ సిటీ మరియు తిరిగి ఉత్తరం వైపు వెళుతుంది.
రూట్ F59 దుబాయ్ ఇంటర్నెట్ సిటీ మెట్రో స్టేషన్ నుండి దుబాయ్ నాలెడ్జ్ విలేజ్ వరకు నడుస్తుంది.
ఇతర మార్పులు:
1. రూట్ 21 పేరు మార్చబడుతుంది. రెండు మార్గాలుగా 21A, 21B విభజించబడుతుంది.
రూట్ 21A అల్ క్యూజ్ క్లినికల్ పాథాలజీ సర్వీసెస్ బస్ స్టాప్ 1 నుండి అల్ ఘుబైబా బస్ స్టేషన్ వరకు ప్రారంభమవుతుంది.
రూట్ 21B ఆపోజిట్ దిశలో అల్ ఘుబైబా బస్ స్టేషన్ నుండి అల్ క్వోజ్ క్లినికల్ పాథాలజీ సర్వీసెస్ బస్ స్టాప్ 1 వరకు నడుస్తుంది.
2. రూట్ 61D రూట్ 66తో మెర్జ్ చేయబడుతుంది.
3. రూట్ 95 రూట్ 95Aతో మెర్జ్ చేయనున్నారు.
4. అల్ ఘుబైబా స్టేషన్ నుండి ఔద్ మేథా వరకు సెక్టార్‌ను రద్దు చేయడం వల్ల రూట్ 6 కోసం మార్గం ఔద్ మేథా మెట్రో స్టేషన్‌లోని బస్‌స్టాప్ నుండి దుబాయ్ హెల్త్‌కేర్ సిటీ వరకు కుదించారు.
5. రూట్ 99 JAFZA Oneను కవర్ చేయడానికి సవరించారు.
6. ది గ్రీన్స్‌లో కొత్త స్టాప్‌లను చేర్చడానికి రూట్ F31 సర్దుబాటు చేయనున్నారు.
7. రూట్ F45 కోసం అల్ ఫుర్జన్‌లో కూడా కొత్త స్టాప్‌లు ఏర్పాటు చేయనున్నారు.
8. JAFZA రూట్ F54 నుండి ఒక స్టాప్ తీసివేయనున్నారు.
9. యూనియన్ బస్ స్టేషన్‌కు బదులుగా ఎటిసలాట్ బస్ స్టేషన్ నుండి ఫుజైరాకు వెళ్లడానికి ఇంటర్‌సిటీ రూట్ E700 సర్దుబాటు చేశారు.
10. RTA పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీ 6, 20B, 26, 36A, 36B, 50, 66, 83, 88, 95A, 96, 99, 320, C01, C09, F03, F05, F07, F10, F18, F23, F23A, F24, F31, F45, F46, F47, F49, F53, F54, SM1, X02, X25, మరియు X92 సకాలంలో రాకపోకలు సాగించేలా 35 బస్సు మార్గాలను అప్డేట్ చేయనున్నారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు