కవితకు బెయిల్ మంజూరు

- August 27, 2024 , by Maagulf
కవితకు బెయిల్ మంజూరు

న్యూ ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన BRS MLC కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమె దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై ఈరోజు(మంగళవారం) సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కవిత తరఫున సీనియర్‌ లాయర్ ముకుల్‌ రోహత్గీ, ఈడీ తరఫున ఏఎస్‌జీ వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం కవితకు బెయిల్‌ మంజూరు చేసింది. కాగా, ఈ కేసులో మార్చి 15న అరెస్టైన కవిత 153 రోజులు తిహార్ జైలులో ఉన్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఈ ఏడాది మార్చి 15న అరెస్ట్‌ చేసింది. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం కింద అరెస్ట్‌ చేసినట్లు ఈడీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జోగేందర్‌ ప్రకటించారు. ఇంట్లో సోదాలు నిర్వహించి, మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం ప్రకారం ఆమెను విచారించి వాంగ్మూలం నమోదు చేశారు. ఆమె నుంచి ఐదు సెల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

అసలేం జరిగిదంటే..?

ఢిల్లీ మద్యం విధానంలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ 2022 ఆగస్టులో సీబీఐ కేసు నమోదు చేసింది. ఇదే కేసులో హైదరాబాద్‌కు చెందిన మద్యం వ్యాపారి అరుణ్‌ రామచంద్రపిళ్లై వాంగ్మూలాన్ని సేకరించిన అనంతరం కవితకు నోటీసులు జారీ చేసింది. మరోవైపు దిల్లీ మద్యం టెండర్ల వ్యవహారంలో సౌత్‌ లాబీ తరఫున రూ.కోట్లు చేతులు మారాయనే కోణంలో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. అరుణ్‌ రామచంద్రపిళ్లై రిమాండ్‌ నివేదికలో అతడిని కవిత బినామీగా పేర్కొంది. ఈ సౌత్‌ గ్రూప్‌ ద్వారా రూ.100కోట్ల ముడుపులు ఆప్‌కు హవాలా మార్గంలో అందాయని అభియోగం మోపింది. గతేడాది మార్చిలో కవితకు నోటీస్‌ జారీ చేసి విచారించింది. ఆ తర్వాత మరోమారు కూడా సమన్లు జారీ చేసింది. అవి మహిళలకు ఉన్న హక్కులను ఉల్లంఘించేలా ఉన్నందున వాటిని కొట్టేయాలని ఆమె గత ఏడాది మార్చి 15న సుప్రీంకోర్టును ఆశ్రయించి అప్పట్లో ఉపశమనం పొందారు. సరిగ్గా ఈ ఏడాది అదే రోజు ఆమెను ఈడీ అరెస్టు చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com