నకిలీ ట్రావెల్ ఏజెన్సీలపై జాగ్రత్త.. బహ్రెయిన్ హెచ్చరిక
- August 28, 2024
బహ్రెయిన్: నకిలీ ట్రావెల్ ఏజెన్సీల పట్ల జాగ్రత్తగా ఉండాలని బహ్రెయిన్ విదేశాంగ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు బాగ్దాద్‌లోని బహ్రెయిన్ రాయబార కార్యాలయం ఇరాక్ మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు ప్రారంభించినట్టు తెలిపింది. ట్రావెల్ ఏజెన్సీ యజమాని హోటల్ బిల్లులను చెల్లించడంలో విఫలమవడంతో 140 మంది బహ్రెయిన్ పౌరుల పాస్‌పోర్ట్‌లను కర్బలా సిటీలోని ఒక హోటల్ స్వాధీనం చేసుకుంది. ఈ నేపథ్యంలో బాగ్దాద్‌లోని బహ్రెయిన్ ఎంబసీకి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో బహ్రెయిన్ స్పందించింది. ఉన్నతాధికారుల ప్రయత్నాల ఫలితంగా ప్రయాణ పత్రాలను ఎట్టకేలకు తిరిగి పొందగలిగారు.బహ్రెయిన్‌లో అమలులో ఉన్న చట్టాల ప్రకారం ట్రావెల్ ఏజెన్సీల లైసెన్స్‌లను ధృవీకరించాలని, రిజర్వేషన్లు మరియు చెల్లింపులు చేయడానికి ముందు, నకిలీ బుకింగ్‌లు మరియు ఏజెన్సీ యజమానుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు