హాకీ టోర్నమెంట్ లో టీమిండియా కు రజతం..
- June 18, 2016
చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్ లో టీమిండియా పురుషుల జట్టు రజతంతో సరిపెట్టుకుంది. వరల్డ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన తుదిపోరులో భారత్ 1-3 తేడాతో ఓటమిపాలై రజతానికి పరిమితమైంది. టైటిల్ నిర్ణయాత్మక పెనాల్టీ షూటౌట్ లో ఆస్ట్రేలియా మూడో గోల్స్ చేసి పైచేయి సాధించగా, భారత్ కు ఒక గోల్ మాత్రమే నమోదు చేసింది. భారత ఆటగాళ్లలో హర్మన్ ప్రీత్ సింగ్ తన అవకాశాన్ని వినియోగించుకుని గోల్ సాధించగా, ఎస్ కే ఉతప్ప, ఎస్వీ సునీల్, సురేందర్ లు బంతిని లక్ష్యాన్ని చేర్చడంలో విఫలమయ్యారు. దీంతో ఈ టోర్నీలో తొలిసారి ఫైనల్ కు వెళ్లిన భారత్ రన్నరప్ గా సరిపెట్టుకుంది.మరోవైపు పటిష్టమైన ఆస్ట్రేలియా అరాన్ జలేస్కీ, డానియల్ బీలే, సిమన్ ఓర్చాడ్ లు తలో గోల్ చేసి విజయంలో ముఖ్యభూమిక పోషించారు.ఇదిలా ఉండగా ఆస్ట్రేలియా బీలే వేసిన గోల్ నమోదు చేసిన రెండో గోల్ వివాదస్పదమైంది. ఆ గోల్ పై మ్యాచ్ అనంతరం భారత జట్టు నిరసన వ్యక్తం చేయడంతో తుది ఫలితాన్ని ప్రకటించటానికి కాస్త సమయం పట్టింది. ఈ టోర్నీలో 1982లో భారత్ కాంస్య పతకం మాత్రమే సాధించగా, తొలిసారి రజతం సాధించడం విశేషం. భారత్ రజతం సాధించడంతో ప్రధాని నరేంద్ర మోదీ జట్టు సభ్యులను అభినందించారు. 'చాంపియన్స్ ట్రోఫీలో రజతం సాధించిన హాకీ జట్టుకు అభినందనలు. భారత జట్టు ఫైనల్ కు చేరే క్రమం నిజంగా అద్భుతం. జట్టు ఆటతీరును చూసి యావత్ భారత జాతి గర్విస్తుంది' అని మోదీ తన ట్వీట్ లో ప్రశంసించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







