రాజ్యసభ రేసులో గల్లా జయదేవ్..? చంద్రబాబుతో చర్చలు..
- August 28, 2024
గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ రెండు సార్లు ఎంపీగా గెలిచారు.. 2019లో వైసీపీ హవాను సైతం తట్టుకుని నిలబడ్డారు.. పారిశ్రామిక వేత్తగా, ఎంపీగా ఉన్న ఆయన..
ఇటీవల రాజకీయాలకు గుడ్ బై చెప్పారు.. టీడీపీ మద్దతుదారునిగా ఉంటానని చెప్పారు.. సహచర ఎంపీలకు పార్టీ ఇచ్చి బైబై చెప్పారు.. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ రాజకీయాల మీద ఆసక్తి పుట్టుకొచ్చింది..
పార్లమెంట్ లో ఏపీ సమస్యలను లేవెత్తనడంలో ఆయన మంచి వాగ్దాటి.. ప్రజా సమస్యలపై స్పృహ కల్గిన నేత కావడంతో ఆయన సేవలను ఉపయోగించుకోవాలని సీఎం చంద్రబాబునాయుడు భావిస్తున్నారట.. యువకుడు, పారిశ్రామికవేత్త కావడంతో ఆయన్ని మళ్లీ టీడీపీలో యాక్టివ్ చెయ్యాలని అధినేత చూస్తున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది.. ఈ క్రమంలో గల్లా జయదేవ్ చూపు మాత్రం రాజ్యసభ సీటు మీద ఉందని ఆయన అనుచరులు చెబుతున్నారు..
2026లో ఏపీకి సంబంధించి రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి. ఇందులో ఒక సీటుపై గల్లా జయదేవ్ కన్నేశారని ఎన్టీయార్ భవన్ వర్గాల టాక్.. చంద్రబాబు సైతం గల్లా జయదేవ్ కు రాజ్యసభ ఇచ్చేందకు ఆసక్తితో ఉన్నారని చర్చ నడుస్తోంది.. రాజ్యసభ ఖాళీ అయ్యేలోపు డిల్లీలో ఆయన్ని ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించి.. అనంతరం రాజ్యసభ ఇస్తారని తెలుస్తోంది.. బిజేపీతో పొత్తు ఉన్న నేపథ్యంలో ఏపీకి నిదులు తీసుకురావడంలో గల్లా కృషి చెయ్యాలని పలువురు కోరుతున్నారు..
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు