లేబర్ మార్కెట్ లా,రెసిడెన్సీ చట్టంపై నిరంతర నిఘా..!
- August 29, 2024
కువైట్: వివిధ గవర్నరేట్లలోని కార్మిక మార్కెట్ నిబంధనలను అమలు చేయడానికి కొనసాగుతున్న ప్రయత్నాలను కువైట్ మొదటి ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి,అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఫహద్ యూసుఫ్ సౌద్ అల్-సబా పునరుద్ఘాటించారు.షేక్ ఫహాద్ అల్-యూసుఫ్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ డైరెక్టర్ల బోర్డుతో సమావేశానికి అధ్యక్షత వహించినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఈ సమావేశంలో దేశంలోని వివిధ రంగాలకు సేవలందించే విధానాలను మెరుగుపరచడానికి, అభివృద్ధి చేయడానికి నిరంతర ప్రయత్నాలపై సమీక్ష నిర్వహించారు.ఆర్థిక అభివృద్ధిలో వ్యూహాత్మక లక్ష్యాలను సాధించేలా, కార్మిక మార్కెట్ యంత్రాంగాలను మెరుగుపరచడానికి అథారిటీ కొనసాగుతున్న తనిఖీలను మంత్రి ప్రశంసించారు.దీనితోపాటు రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించేవారిని లక్ష్యంగా చేసుకుని భద్రతా తనిఖీలు, చేపట్టిన చర్యల గురించి మంత్రికి వివరించారు.
తాజా వార్తలు
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్‌లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్







