5,000 దిర్హామ్‌లకు రెసిడెన్సీ వీసా ఆఫర్..ఇది స్కామ్..నిపుణులు హెచ్చరిక..!

- August 29, 2024 , by Maagulf
5,000 దిర్హామ్‌లకు రెసిడెన్సీ వీసా ఆఫర్..ఇది స్కామ్..నిపుణులు హెచ్చరిక..!

యూఏఈ: యూఏఈ ప్రకటించిన రెండు నెలల క్షమాభిక్ష కార్యక్రమం సెప్టెంబరు 1 నుండి ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో స్కామర్‌లు తప్పుడు ప్రకటనలతో రెచ్చిపోతున్నారు. తక్కువ ధరలకు రెసిడెన్సీ వీసాల పేరిట మోసపూరిత ఆఫర్‌లతో ప్రవాసులను మభ్యపెడుతున్నారు.5,000 దిర్హామ్‌లకు రెసిడెన్సీ వీసాలను అందిస్తామని తమను కొందరు సంప్రదించారని జెబెల్ అలీ,  సోనాపూర్‌లలో నివసిస్తున్న కొద్ది మంది నివాసితులు తెలిపారు.చాలా కాలంగా దేశంలో నివసిస్తున్న నివాసితులు ఎలాగైన రెసిడెన్సీ సంపాదించి యూఏఈలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరి ఆశలను కొందరు సొమ్ము చేసుకునేందుకు తప్పుడు ప్రకటనలతో మోసాలకు పాల్పడుతున్నారు.  
ఇమ్మిగ్రేషన్ నిపుణులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. చట్టబద్ధమైన రెసిడెన్సీ వీసాను పొందడానికి అసలు ఖర్చు Dh5,000 కంటే ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.సెవెన్ సిటీ డాక్యుమెంట్ క్లియరింగ్ సర్వీసెస్‌కు చెందిన మహ్మద్ దావూద్ షాబుద్దీన్ మాట్లాడుతూ..స్కామర్‌లు క్షమాభిక్ష కాలాన్ని సద్వినియోగం చేసుకుని ఓవర్‌స్టేయర్‌లను నకిలీ ఆఫర్‌లతో ఆకర్షిస్తున్నారని తెలిపారు.ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, గుర్తింపు పొందిన ఏజెంట్లతో లేదా నేరుగా ప్రభుత్వ అధికారులతో మాత్రమే సంప్రదింపులు జరపాలని కోరారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com