సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సీరియస్

- August 29, 2024 , by Maagulf
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సీరియస్

న్యూఢిల్లీ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గురువారం ఓటుకు నోటు కేసు విచారణ సందర్భంగా..

కవిత బెయిల్ తీర్పుపై రేవంత్ చేసిన వ్యాఖ్యలను ధర్మాసనం ప్రస్తావించింది. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఒప్పందం కుదరడం వల్లే, కవితకు బెయిల్ వచ్చిందని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. దీన్ని సుప్రీంకోర్టు సీరియస్‌గా తీసుకున్నది.

సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఇలాగే మాట్లాడుతాడా అని కోర్టు ప్రశ్నించింది. జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని సుప్రీం బెంచ్‌.. సీఎం రేవంత్ తీరును తప్పుబట్టింది. సీఎం చేసిన వ్యాఖ్యలు.. ప్రజల మెదళ్లలో అనుమానాలకు తావిస్తుందని ధర్మాసనం పేర్కొన్నది. తమ ఆదేశాలపై విమర్శలు వచ్చినా తామేమీ బాధపడమని, కానీ తాము తమ అంతరాత్మ ప్రకారమే విధులను నిర్వర్తిస్తుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది.

ముఖ్యమంత్రి బాధ్యతగా ఉండాలి కదా..? ఇలా ఎలా మాట్లాడుతారు..? కోర్టులను రాజకీయాల్లోకి లాగడం ఏంటి..? రాజకీయ నాయకులను సంప్రదించి మేము ఆదేశాలు ఇస్తామా..? మేము ఎవరి వ్యాఖ్యలు పట్టించుకోం. మేము మా విధి నిర్వహిస్తాం. మేము ప్రమాణ పూర్వకంగా పని చేస్తాం. మేము ఎవరి పనుల్లో జోక్యం చేసుకోం. సర్వోన్నత న్యాయస్థానం అంటే గౌరవం లేదా..? వ్యవస్థల పట్ల గౌరవం ఉండాలి. ఇలాంటి ప్రవర్తన ఉంటే ఓటుకు నోటు విచారణ రాష్ట్రం బయటే నిర్వహిద్దాం.. అని జస్టిస్ గవాయ్ ధర్మాసనం తీవ్రంగా వ్యాఖ్యానించింది.

కవిత బెయిల్‌పై రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఇవే..
కవిత బెయిల్ కోసం ఎంపీ సీట్లు బీఆర్ఎస్ త్యాగం చేసింది నిజం బీఆర్ఎస్ - బీజేపీ ఒప్పందంలో భాగంగానే కవితకు బెయిల్ వచ్చింది. సిసోడియా, కేజ్రీవాల్‌కు రాని బెయిల్ 5 నెలల్లోనే కవితకు ఎలా వచ్చింది? మెదక్, సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్లో బీజేపీకి మెజారిటీ ఇచ్చింది నిజం కాదా? ఏడు చోట్ల డిపాజిట్ కోల్పోయి, 15 చోట్ల మూడవ స్థానం వచ్చేంత బలహీనంగా బీఆర్ఎస్ ఉందా? అని సీఎం రేవంత్ ప్రశ్నించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com