వచ్చే నెల 8న భారత్కు వెళ్లనున్న అబుధాబి క్రౌన్ ప్రిన్స్
- August 29, 2024
అబుధాబి: అబుధాబి క్రౌన్ ప్రిన్స్ ఖలీద్ బిన్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ వచ్చే నెలలో భారత్లో పర్యటించనున్నారు.యూఏఈ తదుపరి నాయకత్వం కోసం నహ్యాన్ పోటీదారుగా ఉన్నారు. తన పర్యటనలో భాగంగా భారతదేశం యూఏఈ మధ్య వాణిజ్యం, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడంపై చర్చల కోసం భారత్కు వస్తున్నట్లు తెలుస్తోంది.
షేక్ ఖలీద్ సెప్టెంబర్ 8న భారత్కు వచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ పర్యటన పై ఇంతవరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు.తన పర్యటనలో అబుధాబి క్రౌన్ ప్రిన్స్ ప్రధాని నరేంద్ర మోడీని, దేశ అగ్ర నాయకత్వాన్ని కలుస్తారని తెలుస్తోంది.ఈ పర్యటన రాబోయే దశాబ్దాలలో భవిష్యత్ సంబంధాలను మరింతగా పెంచుకోవడం పై దృష్టి సారించనున్నది.
‘భారత్, యూఏఈ మధ్య సంబంధాలు ఇప్పుడు చాలా బలంగా ఉన్నాయి.ఈ పర్యటనలో ఆ పునాదిని మరింత బలోపేతం చేయడం, రాబోయే దశాబ్దాల కోసం ఎదురుచూడడం, యూఏఈ భవిష్యత్ నాయకత్వంతో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకోవడం పై దృష్టి సారించనున్నట్లు-అబుధాబి అధికారి ఒకరు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







