యూఏఈలో ఆమ్నెస్టీ: భారతీయ పౌరులకు ఎంబసీ కీలక సూచనలు..!

- August 30, 2024 , by Maagulf
యూఏఈలో ఆమ్నెస్టీ: భారతీయ పౌరులకు ఎంబసీ కీలక సూచనలు..!

యూఏఈ: సెప్టెంబర్ 1 నుంచి యూఏఈలో రెండు నెలల క్షమాభిక్ష పథకం ప్రారంభమవుతుంది.ఈ నేపథ్యంలో అబుదాబి ఎమిరేట్‌లో నివసిస్తున్న భారతీయ పౌరుల ప్రయోజనాల కోసం అబుదాబిలోని ఇండియన్ ఎంబసీ పలు సూచనలు చేసింది.దరఖాస్తుదారులు అల్ రీమ్, ముసఫా మరియు అల్-ఐన్‌లోని ఏదైనా BLS కేంద్రాలను సంప్రదించవచ్చని తెలిపింది. ప్రయాణ పత్రాల కోసం దరఖాస్తు చేయడానికి నేరుగా చేరుకోవాలని, ముందస్తు అపాయింట్‌మెంట్ అవసరం లేదని పేర్కొంది.

ఇండియాకు తిరిగి రావాలనుకునే దరఖాస్తుదారులకు, ఎమర్జెన్సీ సర్టిఫికేట్ (EC) ఉంటుందని గుర్తుచేసింది. దరఖాస్తుదారులు కాన్సులర్ నుండి ECలను తీసుకునే అవకాశం ఉంటుంది. దీని కోసం భారత రాయబార కార్యాలయం అబుదాబి (101,102, ఇస్ట్ ఫ్లోర్, గారిడాన్ టవర్, అల్సాదా జోన్ I) లో సాయత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్య దరఖాస్తులు అందజేయాలని సూచించింది.  తమ రెసిడెన్సీ స్థితిని క్రమబద్ధీకరించుకోవాలనుకునే దరఖాస్తుదారులు అల్ రీమ్, ముసఫా మరియు అల్-ఐన్‌లోని BLS కేంద్రాలలో షార్ట్‌వాలిడిటీ పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.  ఆమ్నెస్టీ స్కీమ్ అమల్లో ఉన్నసమయంలో ఏదైనా సమాచారం కోసం మొబైల్ నంబర్ 050-8995583లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు సంప్రదించవచ్చని ఒక ప్రకటనలో ఎంబసీ వెల్లడించింది.  [

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com