యూఏఈలో ఆమ్నెస్టీ: భారతీయ పౌరులకు ఎంబసీ కీలక సూచనలు..!
- August 30, 2024
యూఏఈ: సెప్టెంబర్ 1 నుంచి యూఏఈలో రెండు నెలల క్షమాభిక్ష పథకం ప్రారంభమవుతుంది.ఈ నేపథ్యంలో అబుదాబి ఎమిరేట్‌లో నివసిస్తున్న భారతీయ పౌరుల ప్రయోజనాల కోసం అబుదాబిలోని ఇండియన్ ఎంబసీ పలు సూచనలు చేసింది.దరఖాస్తుదారులు అల్ రీమ్, ముసఫా మరియు అల్-ఐన్‌లోని ఏదైనా BLS కేంద్రాలను సంప్రదించవచ్చని తెలిపింది. ప్రయాణ పత్రాల కోసం దరఖాస్తు చేయడానికి నేరుగా చేరుకోవాలని, ముందస్తు అపాయింట్మెంట్ అవసరం లేదని పేర్కొంది.
ఇండియాకు తిరిగి రావాలనుకునే దరఖాస్తుదారులకు, ఎమర్జెన్సీ సర్టిఫికేట్ (EC) ఉంటుందని గుర్తుచేసింది. దరఖాస్తుదారులు కాన్సులర్ నుండి ECలను తీసుకునే అవకాశం ఉంటుంది. దీని కోసం భారత రాయబార కార్యాలయం అబుదాబి (101,102, ఇస్ట్ ఫ్లోర్, గారిడాన్ టవర్, అల్సాదా జోన్ I) లో సాయత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్య దరఖాస్తులు అందజేయాలని సూచించింది. తమ రెసిడెన్సీ స్థితిని క్రమబద్ధీకరించుకోవాలనుకునే దరఖాస్తుదారులు అల్ రీమ్, ముసఫా మరియు అల్-ఐన్‌లోని BLS కేంద్రాలలో షార్ట్వాలిడిటీ పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఆమ్నెస్టీ స్కీమ్ అమల్లో ఉన్నసమయంలో ఏదైనా సమాచారం కోసం మొబైల్ నంబర్ 050-8995583లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు సంప్రదించవచ్చని ఒక ప్రకటనలో ఎంబసీ వెల్లడించింది. [
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..