బహ్రెయిన్ లో పెరిగిన ఎయిర్ కండీషనర్ దిగుమతులు..!
- August 30, 2024
మనామా: బహ్రెయిన్ లో 2024 మొదటి అర్ధ భాగంలో ఎయిర్ కండీషనర్ దిగుమతులలో పెరుగుదలను నమోదైంది. దిగుమతి చేసుకున్న ఎయిర్ కండిషనింగ్ యూనిట్ల సంఖ్య 66,760కి చేరుకుందని అధికారిక డేటా తెలిపింది. 2023 ప్రథమార్థంలో దిగుమతి చేసుకున్న 61,500 యూనిట్లతో పోలిస్తే 8.6% అధికమని వెల్లడించింది. ఎయిర్ కండీషనర్ దిగుమతుల విలువ కూడా 2023లో ఇదే కాలంలో నమోదైన BD7.37 మిలియన్లతో పోలిస్తే 42.1% పెరిగి BD10.47 మిలియన్లకు చేరుకుంది. నివాసితులు వేసవి నెలల్లోనే కాకుండా, ఏడాది పొడవునా అధిక ఉష్ణోగ్రతల నుండి ఉపశమనం పొందేందుకు ఎయిర్ కండీషనర్ల వినియోగానికి ప్రాధాన్యత ఇవ్వడంతో వాటికి డిమాండ్ పెరుగుతుందని నిపుణులు తెలిపారు.
బహ్రెయిన్‌కు దిగుమతి అవుతున్న ఎయిర్ కండిషనర్ల మొత్తం దిగుమతులలో BD2.23 మిలియన్ల(21.9%) విలువైన దిగుమతులతో చైనా అతిపెద్ద సరఫరా దేశంగా నిలిచింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) BD1.06 మిలియన్ల(10.2%)తో రెండో స్థానంలో ఉంది. ఇండియా BD1.04 మిలియన్ల(9.9%)తో తర్వాతి స్థానంలో ఉందని నివేదిక వెల్లడించింది.
సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్ (ఫ్రీయాన్)కు అత్యంత డిమాండ్ ఉందని, మొత్తం దిగుమతుల్లో 43%( BD4.5 మిలియన్) ఇవే ఉన్నాయని డేటా తెలిపింది. 2024లో అత్యధికంగా ఎయిర్ కండీషనర్ దిగుమతి అయిన నెలగా ‘మే’ నిలిచింది. BD2.52 మిలియన్ విలువ కలిగిన 21,346 యూనిట్లు దిగుమతి అయ్యాయి. మొత్తం దిగుమతుల్లో దీని వాటా 24 శాతం కావడం గమనార్హం. అదే విధంగా జూన్ నెలలో 16,849 యూనిట్లు(BD2.29 మిలియన్ ) దిగుమతి అయ్యాయి.
తాజా వార్తలు
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!







