జాయింట్ ఫోర్సెస్ కమాండర్‌ను నియమించిన కింగ్ సల్మాన్
- August 30, 2024
రియాద్: ఫహద్ అల్-సల్మాన్ మేజర్ జనరల్ స్థాయి నుండి లెఫ్టినెంట్ జనరల్ స్థాయికి ప్రమోషన్ పొందారు. అతడిని జాయింట్ ఫోర్సెస్ కమాండర్‌గా రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ నియమించారు. ఈ మేరకు రాయల్ ఉత్తర్వులు జారీ చేశారు. జాయింట్ ఫోర్సెస్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ముత్లాక్ అల్-అజిమా పదవీ విరమణ పొందారు. అనంతరం మరోక ఉత్తర్వు ద్వారా అతడిని లెఫ్టినెంట్ జనరల్ హోదాలో రాయల్ కోర్ట్‌కు సలహాదారుగా నియమించారు.
నావల్ ఫోర్సెస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఫహద్ అల్-ఘుఫైలీని లెఫ్టినెంట్ జనరల్ హోదాతో జనరల్ స్టాఫ్ యొక్క డిప్యూటీ చీఫ్‌గా నియమించారు. ల్యాండ్ ఫోర్సెస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఫహద్ అల్-ముటైర్ను రక్షణ మంత్రి కార్యాలయంలో సలహాదారుగా నియమించారు. మంత్రుల మండలి సెక్రటేరియట్లో సలహాదారుగా ఉన్న సమీర్ అల్-తబీబ్‌ను రక్షణ మంత్రిత్వ శాఖలో సలహాదారుగా నియమించారు.
తాజా వార్తలు
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!