యూఏఈలో వీసా అమ్నెస్టీ ప్రోగ్రాం..ధరఖాస్తు ప్రక్రియ, విధివిధానాలు..!
- August 30, 2024
యూఏఈ: దుబాయ్‌లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (జిడిఆర్ఎఫ్ఎ) యూఏఈ వీసా అమ్నెస్టీ ప్రోగ్రాం కోసం దరఖాస్తుదారులను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఇది సెప్టెంబర్ 1 ప్రారంభమవుతున్న విషయం తెలిపిందే. ఈ ఏడాది అక్టోబర్ 30 వరకు రెండు నెలల పాటు ఈ స్కీమ్ కొనసాగుతుంది. అల్ అవీర్‌లోని GDRFA సెంటర్లో వీసా స్టేటస్‌ని మార్చుకునేందుకు ప్రత్యేకంగా కేటాయించారు. దీనితోపాటు దుబాయ్‌లోని 86 అమెర్ సెంటర్లలో దరఖాస్తుదారులు వెళ్లవచ్చని GDRFA వెల్లడించింది.
అయితే, ఎమిరేట్స్ లో ఉండాలనుకునే వారి కోసం అమేర్ కేంద్రాలు సేవలు అందిస్తాయని తెలిపారు. బయోమెట్రిక్ వేలిముద్రలు కలిగిన వారికి (ఎమిరేట్స్ ID ఉన్నవారు) మాత్రమే బయలుదేరే అనుమతులను జారీ చేస్తారని పేర్కొన్నారు. దేశం విడిచి వెళ్లాలనుకునే వారికి డిపార్చర్ పర్మిట్లను కూడా జారీ చేస్తుందన్నారు. కాగా, ఏదైనా వీసా చట్టం ఉల్లంఘించిన వారు దేశానికి తిరిగి రాకుండా ఎలాంటి అడ్మినిస్ట్రేటివ్ పరిమితులు లేకుండా క్షమాభిక్షను పొందిన తర్వాత యూఏఈ వదిలి వెళ్ళడానికి అనుమతిస్తారని తెలిపింది. పాస్‌పోర్ట్‌పై ఎటువంటి నిషేధ స్టాంప్ ఉండదని, వారు చెల్లుబాటు అయ్యే వీసాపై యూఏఈలోకి తిరిగి ప్రవేశించవచ్చని GDRFA డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ మొహమ్మద్ అహ్మద్ అల్ మర్రి వెల్లడించారు. క్షమాభిక్ష పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునే వారు అధికారిక మూలాల నుండి మాత్రమే సమాచారాన్ని పొందాలని, 24/7 పనిచేసే GDRFA కాల్ సెంటర్ 8005111 ద్వారా సమాచారాన్ని ధృవీకరించుకోవాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!