వచ్చే నెలలో 15రోజులు బ్యాంకులకు సెలవు..
- August 30, 2024
ముంబై: బ్యాంక్ సెలవుల కారణంగా లావాదేవీల విషయంలో ఖాతాదార్లు ఎలాంటి ఇబ్బంది పడకుండా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ముందుగానే బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేస్తుంది. కాగా, వచ్చే నెలలో (సెప్టెంబర్ 2024), వివిధ పండుగలు & సందర్భాలు, రెండో శనివారం, నాలుగో శనివారం, ఆదివారాల కారణంగా బ్యాంక్‌లు మొత్తం 15 రోజులు పని చేయవు. బ్యాంక్ సెలవులు అన్ని రాష్ట్రాలకు ఒకేలా ఉండవు, ప్రాంతాన్ని బట్టి మారతాయి.
సెప్టెంబర్ 7న (శనివారం) వినాయక చవితి, ఆ వెంటనే ఆదివారం కావడంతో వరుసగా రెండు రోజులు బ్యాంకులకు సెలవు వచ్చింది. ఇక 14వ తేదీన రెండో శనివారం, 15న ఆదివారం, 16న ఈద్ సందర్భంగా వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి.
సెప్టెంబర్ నెలలో బ్యాంక్ సెలవు రోజులు:
- 01 సెప్టెంబర్ 2024, (ఆదివారం)–దేశవ్యాప్తంగా బ్యాంక్‌లకు సెలవు
- 05 సెప్టెంబర్ 2024, (గురువారం)–శ్రీమంత శంకర్‌దేవ్, హర్తాళికా తీజ్ – అస్సాం, ఛత్తీస్‌గఢ్, సిక్కిం
- 07 సెప్టెంబర్ 2024, (శనివారం)–వినాయక చవితి–దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు
- 08 సెప్టెంబర్ 2024, (ఆదివారం)–దేశవ్యాప్తంగా బ్యాంక్‌లకు సెలవు
- 13 సెప్టెంబర్ 2024, (శుక్రవారం)–తేజ దశమి–రాజస్థాన్‌లో బ్యాంక్‌లకు హాలిడే
- 14 సెప్టెంబర్ 2024, (శనివారం)–రెండో శనివారం + ఓనం పండుగ
- 15 సెప్టెంబర్ 2024, (ఆదివారం)–దేశవ్యాప్తంగా బ్యాంక్‌లకు సెలవు
- 16 సెప్టెంబర్ 2024, (సోమవారం)–ఈద్ ఇ మిలాద్–దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు
- 17 సెప్టెంబర్ 2024, (మంగళవారం)–ఇంద్ర జాత్ర–సిక్కింలో బ్యాంక్‌లకు సెలవు ఇస్తారు
- 18 సెప్టెంబర్ 2024, (బుధవారం)–శ్రీ నారాయణ గురు సమాధి–కేరళలో బ్యాంక్‌లకు హాలిడే
- 21 సెప్టెంబర్ 2024, (శనివారం)–శ్రీ నారాయణ గురు సమాధి, కేరళలో బ్యాంక్‌లకు హాలిడే
- 22 సెప్టెంబర్ 2024, (ఆదివారం)–దేశవ్యాప్తంగా బ్యాంక్‌లకు సెలవు
- 23 సెప్టెంబర్ 2024, (సోమవారం)–అమరవీరుల దినోత్సవం–హరియాణాలో అధికారిక సెలవు
- 28 సెప్టెంబర్ 2024, (శనివారం)–నాలుగో శనివారం–దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు
- 29 సెప్టెంబర్ 2024, (ఆదివారం)–దేశవ్యాప్తంగా బ్యాంక్‌లకు సెలవు
తాజా వార్తలు
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!