ఆ వార్తలు అబద్దం…లడ్డూ ప్రసాదం విక్రయాలలో మార్పులు లేవు: టిటిడి
- August 30, 2024
తిరుమల: ఒకసారి లడ్డూలు తీసుకుంటే తిరిగి నెల రోజుల తర్వాతే మళ్లీ లడ్డూలను తీసుకునేందుకు అవకాశం ఉంటుందని.. దళారులను అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అదనపు ఈవో వెంకయ్య చౌదరి పేరుతో వచ్చిన వార్త పై టిటిడి దీని పై వివరణ ఇచ్చింది. తిరుమలలో లడ్డూ విక్రయ విధానాల్లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. దర్శనం చేసుకున్న తర్వాత భక్తులకు ఇచ్చే ఉచిత లడ్డూతో పాటు నాలుగు నుంచి ఆరు లడ్డూల వరకు విక్రయిస్తామని చెప్పింది. దర్శనం టికెట్లు, టోకెన్లు లేని భక్తులకు మాత్రమే ఆధార్ కార్డు నమోదుతో రెండు లడ్డూలు విక్రయిస్తామని క్లారిటీ ఇచ్చింది. నెలకు ఒకసారి మాత్రమే లడ్డూలు అన్నది నిజం కాదని.. అదనపు లడ్డూలను ప్రతిరోజూ తీసుకోవచ్చని తెలిపింది.
టికెట్స్, టోకెన్స్ లేకుండానే కొంతమంది లడ్డూలను కొనుగోలు చేస్తున్నారని.. వాటిని బయట బ్లాక్లో అధిక ధరలకు అమ్ముతున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. అందుకే టోకెన్లు లేని వారికి ఆధార్ నిబంధన పెట్టామని చెప్పారు. దళారీలను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..