సీఎం రేవంత్ కు వేములవాడ అర్చకుల ఆశీర్వాదం..
- August 30, 2024
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ అర్చక బృందం వేద ఆశీర్వచనం అందజేశారు. శుక్రవారం హైదరాబాదులోని సచివాలయంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆశీర్వచనం అందించి రాజన్న ప్రసాదం అందజేశారు.
వేములవాడ ఆలయ విస్తరణ కోసం 50 కోట్ల రూపాయలు కేటాయించినందుకు ఎమ్మెల్యేతో పాటు ఆలయ ఈవో వినోద్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆలయ విస్తరణ కోసం నమూనాలకు శృంగేరి పీఠం అనుమతి తీసుకోవాల్సి ఉందని ముఖ్యమంత్రికి తెలియజేశారు. వెంటనే శృంగేరి పీఠం అనుమతి తీసుకొని విస్తరణ పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ముఖ్యమంత్రిని స్థపతి వల్లినాయగం, ఈఈ రాజేష్, డీఈఈ రఘునందన్, ఆలయ ప్రధాన అర్చకులు ఉమేష్ శర్మ తో పాటు పలువురు కలిశారు. ఆలయ విస్తరణకు సంబంధించిన డిజైన్స్, నమూనాకు శృంగేరి పీఠం అనుమతి తీసుకోవాల్సి ఉందని ఆలయ అర్చకులు సీఎంకు తెలిపారు. వెంటనే వెళ్లి శృంగేరి పీఠం అనుమతి తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
తాజా వార్తలు
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్‌కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!







