యూఏఈలో ట్రాఫిక్ జామ్‌లను తగ్గించడానికి ఆడ్-ఈవెన్ పథకం' సహాయపడుతుందా?
- August 30, 2024
యూఏఈ: యూఏఈలో పాఠశాలలు తిరిగి ప్రారంభం, నివాసితులు వేసవి సెలవుల నుండి తిరిగి రావడంతో గత కొన్ని రోజులుగా రోడ్లపై రద్దీ అధికంగా ఉందని వాహనదారులు, ప్రయాణికులు తెలిపారు. ఉదాహరణకు..దుబాయ్‌లో సాలిక్ ట్యాగ్ల ఆధారంగా రిజిస్టర్డ్ వాహనాలు ఇప్పుడు 4.2 మిలియన్లకు చేరుకున్నాయి. గత ఏడాది మొదటి ఆరు నెలలతో పోలిస్తే ఇది 8.8 శాతం పెరిగింది. ఐదు సంవత్సరాల క్రితం రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) అందించిన డేటా ప్రకారం.. ప్రతి ఇద్దరు నివాసితులకు ఒక కారు లేదా 1,000 మందికి 540 వాహనాలు ఉన్నాయి. న్యూయార్క్, లండన్, సింగపూర్ మరియు హాంకాంగ్ వంటి నగరాల్లో 1,000 మంది నివాసితులకు వరుసగా 305, 213, 101 మరియు 63 వాహనాలు ఉన్నాయి.
2006లో దుబాయ్‌లో నమోదైన వాహనాల సంఖ్య దాదాపు 740,000 మాత్రమే. ఇది 2015లో 1.4 మిలియన్లకు రెండింతలు పెరిగింది. 2020 నాటికి 1.83 మిలియన్లకు చేరుకుంది.
న్యూయార్క్ యూనివర్శిటీ అబుదాబి (NYUAD)లో గ్రాడ్యుయేట్ అఫైర్స్ కోసం ఇంజినీరింగ్ అసోసియేట్ డీన్ డాక్టర్ మోనికా మెనెండెజ్ మాట్లాడుతూ.. ఈవెన్ ఆడ్ పథకాన్ని రోడ్ స్పేస్ రేషనింగ్ అని కూడా పిలుస్తారు. లైసెన్స్ ప్లేట్ ముగింపు సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. అంటే 1 మరియు 2తో ముగిసే కార్ ప్లేట్లు ఉన్న వాహనాలు సోమవారం రోడ్డుపైకి అనుమతించబడవు. మంగళవారం 3 మరియు 4; బుధవారం 5 మరియు 6; గురువారం 7 మరియు 8; శుక్రవారం 9 మరియు 0. వారాంతాల్లో శని, ఆదివారాల్లో అన్ని వాహనాలను రోడ్డుపైకి అనుమతిస్తారు. “ఈ పథకం మెక్సికో సిటీ, ఏథెన్స్ మరియు బీజింగ్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక నగరాల్లో అమలు చేస్తున్నారు. కొన్ని నగరాలు దీనిని శాశ్వత లేదా పాక్షిక-శాశ్వత ప్రాతిపదికన ఉపయోగించగా, ఇతర నగరాలు నిర్దిష్ట రోజులలో మాత్రమే ఉపయోగించాయి. వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి తరచుగా అమలు చేయబడిన ఈ విధానం వివిధ స్థాయిలలో విజయాన్ని సాధించింది, ”అని అన్నారు. ట్రాఫిక్ సంబంధిత సమస్యలన్నింటినీ పరిష్కరించగల ఏకైక వ్యూహం అంటూ ప్రత్యేకంగా ఉండదని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..