వినాయక చవితికి ‘గేమ్ ఛేంజర్’ అప్డేట్ పక్కా.!
- August 30, 2024
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా రిలీజ్‌కి రంగం సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. డిశంబర్‌లో ఈ సినిమా వుంటుందని ఇప్పటికే హింట్స్ ఇచ్చారు.
క్రిస్మస్‌కి వస్తున్నా.. అంటూ రామ్ చరణ్ కూడా మొన్నా మధ్య సోషల్ మీడియాలో రెస్పాండ్ అయిన సంగతీ తెలిసిందే. అయితే అధికారికంగా చిత్ర యూనిట్ నుంచి ప్రకటన రాలేదంతే.
అందుకూ తాజాగా సెట్ చేస్తున్నట్లు ఇన్సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం. వినాయక చవితి రోజున అందుకు ముహూర్తం ఫిక్స్ చేశారట. రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌తో పాటూ, అదే రోజు సినిమాకి సంబంధించి గ్లింప్స్ కూడా రిలీజ్ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి సంబంధించి కొన్ని లీక్‌డ్ ఫోటోలు చరణ్ క్యారెక్టర్‌ని అంచనా వేసేశాయ్. రెండు డిఫరెంట్ వేరియేషన్స్‌లో చరణ్ క్యారెక్టర్ వుండబోతోందనీ తెలిసిపోయింది.
అలాగే, సినిమాకి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మెయిన్ అస్సెట్‌గా వుండబోతోందని కూడా విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం. ఏది ఏమైనా వినాయక చవితి రోజు రాబోయే అప్డేట్‌తో ఇంకా ఓ క్లారిటీ రావొచ్చనుకోవచ్చు. లెట్స్ వెయిట్ అండ్ సీ.!
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..