600 దిర్హామ్‌ల కోసం ప్రవాసిపై దాడి..7 మందిని అరెస్టు
- August 31, 2024
యూఏఈ: బుధవారం ఎమిరేట్‌లోని పారిశ్రామిక ప్రాంతంలో జరిగిన ఘర్షణలో షార్జా నివాసి మరణించినట్లు అధికారులు తెలిపారు. 600 దిర్హామ్‌ల అప్పు విషయంలో గొడవ ప్రారంభమైనట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ముగ్గురు తోబుట్టువులను కర్రలు, కత్తులతో కొట్టినందుకు ఏడుగురు ఆసియా ప్రవాసులను అరెస్టు చేసినట్లు షార్జా పోలీసులు తెలిపారు. ఈ సంఘటన తీవ్ర వాగ్వాదంతో ప్రారంభమైందని, అనంతరం ఇది భౌతిక దాడికి దారితీసింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించగా నిందితులు అక్కడి నుంచి పారిపోయారు.
అయితే, సంఘటన జరిగిన వెంటనే షార్జా పోలీసులు దాడి చేసిన వారిని గుర్తించి, ట్రాక్ చేయగలిగారు. రెండు గంటల్లోనే వారిని అరెస్టు చేసినట్టు తెలిపారు. ఆర్థిక పరమైన వివాదం కారణంగా బాధితులపై దాడి చేసినట్లు ఏడుగురు వ్యక్తులు అంగీకరించారు. వివాదాలు వచ్చినప్పుడు చట్టపరమైన విధానాలను ఎల్లప్పుడూ అనుసరించాలని షార్జా పోలీసులు నివాసితులను కోరారు.
తాజా వార్తలు
- నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!
- దుబాయ్‌లో తగ్గిన నేరాల రేటు..ఎకానమీ హైక్..!!
- గ్లోబల్ పాస్‌పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!
- కువైట్ లో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం..!!
- ధురంధర్ కు గల్ఫ్ దేశాలలో అనుమతి నిరాకరణ..!!
- వింటర్ మాటున దాగిఉన్న ప్రమాదం..హెచ్చరికలు జారీ..!!
- IPL 2026 వేలంలో ఏ దేశం ఆటగాళ్లు ఎక్కువ?
- మెస్సీ టూర్.. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి అభిమానులు రచ్చరచ్చ..
- డిసెంబర్ 31నే జనవరి పెన్షన్ పంపిణి
- రుణ గ్రహీతలకు SBI భారీ శుభవార్త..







