3 వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ..
- August 31, 2024
న్యూ ఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశంలో మరో మూడు వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. లక్నో- మీరఠ్, మధురై-బెంగళూరు, చెన్నై-నాగర్కోయిల్ మధ్య ఈ వందేభారత్ రైళ్లు నడుస్తాయి. ఈ రైళ్లను మోదీ వర్చువల్‌గా పచ్చజెండా ఊపి ప్రారంభించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకోవానికి దక్షిణాది రాష్ట్రాలు వేగంగా వృద్ధి చెందడం కీలకమని ప్రధాని మోదీ చెప్పారు.
తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు పెంచిన బడ్జెట్ కేటాయింపుల వల్ల దక్షిణాదిలో రైలు రవాణా మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. వందేభారత్ రైలు వల్ల మీరఠ్- లక్నో మధ్య ప్రయాణ సమయం దాదాపు గంట మేర ఆదా అవుతుందని తెలిపారు.
మిగతా రైళ్ల వల్ల కూడా సమయం ఆదా అవుతుందని చెప్పారు.ఎన్నో ఏళ్లుగా నెలకొన్న సమస్యలకు పరిష్కారం చూపడంలో భారతీయ రైల్వే ఎంతో పురోగతి సాధించిందని అన్నారు. సమాజంలోని అన్ని వర్గాల వారికీ సౌకర్యవంతమైన ప్రయాణం అందించడమే రైల్వే లక్ష్యమని చెప్పారు.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..