ఎపిలో భారీ వర్షాలు…20 రైళ్లు రద్దు…
- August 31, 2024
అమరావతి: భారీ వర్షాలు విజయవాడ, గుంటూరు నగరాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షంతో పలు చోట్ల రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడ డివిజన్ పరిధిలో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. భద్రతా కారణాల రీత్యా వీటిని రద్దు చేసినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. శని, ఆది, సోమవారాల్లో 20 వరకు రైళ్లు రద్దయ్యాయి.
విజయవాడ- తెనాలి, విజయవాడ- గూడురు, తెనాలి- రేపల్లె, గుడివాడ- మచిలీపట్నం, భీమవరం- నిడదవోలు, గుంటూరు- రేపల్లె, విజయవాడ- మచిలీపట్నం, విజయవాడ- ఒంగోలు తదితర టౌన్ల మధ్య రాకపోకలు సాగించే రైళ్లు ఉన్నాయి. ఇందుకు అనుగుణంగా ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే సూచించింది.
రద్దు చేసిన రైళ్ల వివరాలు
07279 – విజయవాడ టు తెనాలి – సెప్టెంబర్ 1
07575- తెనాలి టు విజయవాడ – సెప్టెంబర్ 1
07500 – విజయవాడ టు గూడూరు – ఆగస్టు 31
07458 – గూడూరు టు విజయవాడ – సెప్టెంబర్ 1
17257 – విజయవాడ టు కాకినాడ పోర్ట్ – ఆగస్టు 31
07874 – తెనాలి టు రేపల్లె – ఆగస్టు 31, సెప్టెంబర్ 1
07875 – రేపల్లె టు తెనాలి – ఆగస్టు 31, సెప్టెంబర్ 1
07869 – మచిలీపట్నం టు గుడివాడ – ఆగస్టు 31, సెప్టెంబర్ 1
07868 – గుడివాడ టు మచిలీపట్నం – ఆగస్టు 31, సెప్టెంబర్ 1
07885 – భీమవరం జంక్షన్ టు నిడదవోలు – ఆగస్టు 31, సెప్టెంబర్ 1
07886 – నిడదవోలు టు భీమవరం జంక్షన్ – ఆగస్టు 31, సెప్టెంబర్ 1
07281 – నర్సాపూర్ టు గుంటూరు – ఆగస్టు 31, సెప్టెంబర్ 1
07785 – రేపల్లె టు గుంటూరు – ఆగస్టు 31, సెప్టెంబర్ 1
07976 – గుంటూరు టు విజయవాడ – ఆగస్టు 31, సెప్టెంబర్ 1
17269 – విజయవాడ టు నర్సాపూర్ – ఆగస్టు 31, సెప్టెంబర్ 1
07576 – ఒంగోలు టు విజయవాడ – ఆగస్టు 31, సెప్టెంబర్ 1
07898 – విజయవాడ టు మచిలీపట్నం – ఆగస్టు 31, సెప్టెంబర్ 1
07899 – మచిలీపట్నం టు విజయవాడ – సెప్టెంబర్ 1, సెప్టెంబర్ 2
07461 – విజయవాడ టు ఒంగోలు – సెప్టెంబర్ 1, సెప్టెంబర్ 2 తేదీలలో రద్దు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు సహకరించాలని కోరారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







