జపాన్ కీలక నిర్ణయం..

- August 31, 2024 , by Maagulf
జపాన్ కీలక నిర్ణయం..

టోక్యో: జపాన్ ప్రభుత్వం ఓ వినూత్న నిర్ణయాన్ని తీసుకుంది. ఉద్యోగులు వారానికి కేవలం నాలుగు రోజులు మాత్రమే పనిచేయాలని పేర్కొంది. ఈ విధానం అన్ని సంస్థల్లో అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని జపాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ విధానాన్ని ఎటువంటి 2021లోనే అమలు చేయాలని జపాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే చాలా సంస్థలు ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాయి. 

ఇలా చేయడం వల్ల వారి అభివృద్ధి విషయంలో కొంతకాలానికి జపాన్ ప్రభుత్వం వెనుకబడే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం 8 శాతం సంస్థలే ఆ నిర్ణయాన్ని ఒప్పుకుంటున్నాయి. మిగతా సంస్థలు కూడా తమ ఉద్యోగులతో వారానికి కేవలం నాలుగు రోజులు మాత్రమే పని చేయించుకోవాలని తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 

దీని ద్వారా ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అవకాశాలు ఉంటాయని తెలిపింది. సూక్ష్మ, మధ్య, చిన్నతరహా పరిశ్రమలలో మరికొంతమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చని స్పష్టం చేసింది. ఈ విధానంతో నిరుద్యోగిత రేటు కొంతవరకైనా తగ్గించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. 

అంతేకాకుండా తక్కువ రోజులు పని చేయడంవల్ల కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపేందుకు అవకాశం ఉంటుందని, పిల్లలతో సమయాన్ని గడపవచ్చని, వారి పెంపకంపై దృష్టి పెట్టె అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. జపాన్ లో ఎక్కువ శాతం ఉద్యోగస్తులు ఓవర్ టైం డ్యూటీలు చేయడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు ఎదుర్కొంటున్నారని ఓ నివేదికలో వెళ్లడైంది. అందుకోసమే జపాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించింది.

--సాయి కిరణ్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com