మెడనొప్పి వేధిస్తోందా.? ఈ చిన్న టిప్స్ ఫాలో చేసి చూడండి.!
- August 31, 2024
శరీరంలో ఎక్కడ నొప్పి వున్నా.. అన్ ఈజీగానే అనిపిస్తుంటుంది. ముఖ్యంగా మెడ నొప్పి మరీ బాధిస్తుంటుంది. అనుకోకుండా పట్టేసిన మెడ నొప్పికి మందులు కూడా సరిగా పని చేయవ్ కొన్ని సందర్భాల్లో.
అలాంటి సమయాల్లో ఈ చిన్న వంటింటి చిట్కాలు మంచి ఉపశమనాన్నిస్తాయ్. మెడ పట్టేసినప్పుడు మొదట వేడి నీటితో కాపడం పెట్టాలి. అలా చేయడం వల్ల కాస్త ఉపశమనం వుంటుంది. అలాగే వేడి వేడి నీటితో స్నానం చేసినా కండరాలు రిలాక్స్ అయ్యి మెడ నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
ఐస్ ముక్కల్ని ఓ ప్లాస్టిక్ బ్యాగ్‌లో వేసి నొప్పి వున్న చోట స్మూత్‌గా మసాజ్ చేస్తే కాస్త ఉపశమనం వుంటుంది.
వేయించిన నల్ల జీలకర్ర, గట్టి ఉప్పు, రాక్ సాల్ట్ ఓ క్లాత్‌లో చుట్టి నొప్పి వున్న చోట మసాజ్ చేసినా మంచి ఫలితం వుంటుంది.
టీవీ కానీ, ల్యాప్ ట్యాప్ కానీ చూడాల్సి వచ్చినప్పుడు కళ్లను స్ట్రెయిట్ వేలో వుంచి చూడాలి. తల కింద మెత్తని దిండును ఉపయోగించాలి.
వీటన్నింటినీ చేస్తూనే రోజంతా నీటిని ఎక్కువగా తాగుతుండాలి. ఈ చిన్న టిప్స్ ఫాలో చేస్తే ఆంగ్ర మెడిసెన్ కూడా యూజ్ చేయొచ్చు. అప్పటికీ నొప్పి నుంచి ఉపశమనం లేకుంటే అశ్రద్ధ చేయకుండా వైద్యుని సంప్రదించాలి.
తాజా వార్తలు
- ఇరాన్ దాడుల అనంతరం కతార్లో ఇండియన్ ఎంబసీ హెచ్చరిక
- ఎయిర్ ఇండియా మిడిల్ ఈస్ట్ విమానాలను నిలిపివేత
- నివాసితులను అప్రమత్తంగా ఉండాలని కోరిన దుబాయ్ సెక్యూరిటీ సర్వీస్
- కతార్ పై మిసైల్ దాడిని తీవ్రంగా ఖండించిన GCC ప్రధాన కార్యదర్శి
- బహ్రెయిన్ వైమానిక పరిధిని తాత్కాలికంగా నిలిపివేత
- కువైట్ తాత్కాలికంగా వైమానిక పరిధి మూసివేత
- శ్రీవారి లడ్డూ ప్రసాదం కొనుగోలుకు నూతన సదుపాయం
- ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు: ఎండీ వీసీ సజ్జనర్
- భారత్కి క్రూడాయిల్ విషయంలో ఇబ్బంది లేదు: హర్దీప్ సింగ్
- చెన్నై పోలీసుల అదుపులో హీరో శ్రీరామ్..