క్షమాభిక్ష కోరుకునే వారికి తక్కువ ధరకు విమానయాన టిక్కెట్లు..!

- September 01, 2024 , by Maagulf
క్షమాభిక్ష కోరుకునే వారికి తక్కువ ధరకు విమానయాన టిక్కెట్లు..!

యూఏఈ: క్షమాభిక్ష పొంది వారి దేశాలకు తిరిగి రావాలనుకునే వారికి తక్కువ ధరకు విమాన టిక్కెట్లను అందించడానికి ఎయిర్‌లైన్స్ అంగీకరించాయి. ఇది రెండు నెలల పాటు అమల్లో ఉంటుందని ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్ మరియు పోర్ట్స్ సెక్యూరిటీ (ICP) తెలిపింది. ఈ క్రమంలో జాతీయ మరియు విదేశీ విమానయాన సంస్థలతో సమావేశాలు నిర్వహించామని ICP స్పష్టం చేసింది. గ్రేస్ పీరియడ్ నుండి లబ్ది పొందుతున్న వారికి రెండు నెలల పాటు తగ్గింపుతో కూడిన ప్రయాణ టిక్కెట్లను అందించడానికి ఎయిర్‌లైన్స్ తమ సహకారాన్ని మరియు సంసిద్ధతను వ్యక్తం చేసినట్లు వెల్లడించింది. సర్వీస్ సెంటర్‌లను సందర్శించాల్సిన అవసరం లేకుండా సెప్టెంబర్ 1నుండి ICP ఆమోదించబడిన టైపింగ్ కార్యాలయాల ఎలక్ట్రానిక్, స్మార్ట్ ఛానెల్‌ల ద్వారా వారి అభ్యర్థనలను సమర్పించాలని ICP పిలుపునిచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com