క్షమాభిక్ష కోరుకునే వారికి తక్కువ ధరకు విమానయాన టిక్కెట్లు..!
- September 01, 2024
యూఏఈ: క్షమాభిక్ష పొంది వారి దేశాలకు తిరిగి రావాలనుకునే వారికి తక్కువ ధరకు విమాన టిక్కెట్లను అందించడానికి ఎయిర్‌లైన్స్ అంగీకరించాయి. ఇది రెండు నెలల పాటు అమల్లో ఉంటుందని ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్ మరియు పోర్ట్స్ సెక్యూరిటీ (ICP) తెలిపింది. ఈ క్రమంలో జాతీయ మరియు విదేశీ విమానయాన సంస్థలతో సమావేశాలు నిర్వహించామని ICP స్పష్టం చేసింది. గ్రేస్ పీరియడ్ నుండి లబ్ది పొందుతున్న వారికి రెండు నెలల పాటు తగ్గింపుతో కూడిన ప్రయాణ టిక్కెట్లను అందించడానికి ఎయిర్‌లైన్స్ తమ సహకారాన్ని మరియు సంసిద్ధతను వ్యక్తం చేసినట్లు వెల్లడించింది. సర్వీస్ సెంటర్లను సందర్శించాల్సిన అవసరం లేకుండా సెప్టెంబర్ 1నుండి ICP ఆమోదించబడిన టైపింగ్ కార్యాలయాల ఎలక్ట్రానిక్, స్మార్ట్ ఛానెల్‌ల ద్వారా వారి అభ్యర్థనలను సమర్పించాలని ICP పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్‌కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!







