ఒమన్‌లో 'ఫ్యామిలీ స్పోర్ట్స్ కార్నివాల్'..!

- September 01, 2024 , by Maagulf
ఒమన్‌లో \'ఫ్యామిలీ స్పోర్ట్స్ కార్నివాల్\'..!

మస్కట్: మస్కట్ గవర్నరేట్‌లోని అల్ కుర్మ్ నేచురల్ పార్క్‌లో "ఫ్యామిలీ స్పోర్ట్స్ కార్నివాల్"ని సాంస్కృతిక, క్రీడలు మరియు యువజన మంత్రిత్వ శాఖ నిర్వహించింది. క్రీడలపై అవగాహన పెంచడం, శారీరక దృఢత్వాన్ని పెంపొందించడం, వివిధ క్రీడా కార్యకలాపాల్లో సమాజ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం లక్ష్యం అని పేర్కొంది. ఈవెంట్ సూపర్‌వైజర్ శారీరక శ్రమ సంస్కృతిని పెంపొందించడానికి మంత్రిత్వ శాఖ చేస్తున్న ప్రయత్నాలలో ఇది భాగమని వికలాంగుల క్రీడా కార్యకలాపాల విభాగం అధిపతి ఖలీఫా బిన్ సయీద్ బిన్ హసన్ అల్ మజ్రూయి వెల్లడించారు.  కార్నివాల్‌లో భాగంగా థియేటర్ ప్రదర్శనలు, కార్నివాల్ ఆటలు, సైక్లింగ్ విభాగం, వాకింగ్ ట్రాక్ సహా పలు క్రీడలు, వినోద కార్యకలాపాలు ఉన్నాయి. వీటితోపాటు  స్పోర్ట్స్ కార్నర్‌లో హాజరైన వారి కోసం వివిధ క్రీడా ఉపకరణాలు, సామగ్రిని ఏర్పాటు చేశారు. పిల్లలు, పెద్దలకు ఫేస్ పెయింటింగ్, క్యారెక్టర్‌లతో ఫోటోగ్రఫీ, వర్చువల్ రియాలిటీ అనుభవాలు కల్పించడంతోపాటు బహుమతులు అందజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com