ICRF థర్స్ట్ క్వెన్చర్స్ 2024.. వేసవి అవగాహన కార్యక్రమం..!

- September 01, 2024 , by Maagulf
ICRF థర్స్ట్ క్వెన్చర్స్ 2024.. వేసవి అవగాహన కార్యక్రమం..!

బహ్రెయిన్: ICRF థర్స్ట్ క్వెన్చర్స్ 2024 తొమ్మిదవ ఈవెంట్ బహ్రెయిన్ బేలోని ఒక వర్క్‌సైట్‌లో జరిగింది. ఇండియన్ కమ్యూనిటీ రిలీఫ్ ఫండ్ (ICRF) థర్స్ట్-క్వెన్చర్స్ 2024 బృందం తన వార్షిక వేసవి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. జూలై, ఆగస్టు నెలల్లో సురక్షితమైన పని వాతావరణాన్ని నిర్ధారించడానికి కార్మిక మంత్రిత్వ శాఖ చొరవతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వెల్లడించారు. ఆరోగ్యకరమైన, సురక్షితమైన వేసవిని నిర్వహించడం గురించి అవగాహన కల్పించినట్టు తెలిపారు. వేసవి సందర్బంగా కార్మికులకు వాటర్ బాటిళ్లు, జ్యూస్, నారింజ, యాపిల్స్ మరియు అరటిపండ్లు, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్‌లతో కూడిన ఫ్లైయర్‌లను అందించారు ఈ ఈవెంట్‌లను రాబోయే రెండు వారాల పాటు కొనసాగించాలని యోచిస్తోన్నట్లు  ICRF థర్స్ట్-క్వెన్చర్స్ బృందం వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com